సింగర్ మాళవిక రెండేళ్ల కూతురికి కరోనా, ఆమె తల్లిదండ్రులకు పాజిటివ్
నటీనటులు, సింగర్స్ కరోనా బారిన పడుతున్నారు. లెజెండరి సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. సింగర్ మాళవిక (Singer Malavika) ఐసోలేషన్‌లో ఉండగా మరో షాకింగ్ విషయం వెల్లడించింది.
కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత షూటింగ్స్, ఈవెంట్స్ మొదలు కాగా, నటీనటులు, సింగర్స్ కరోనా బారిన పడుతున్నారు. లెజెండరి సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్ సింగర్స్ సునీత, మాళవిక (Singer Malavika)లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. సింగర్ సునీత కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మాళవిక ఐసోలేషన్‌లో ఉండగా మరో షాకింగ్ విషయం వెల్లడించింది. Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్
తనకు కరోనా సోకడంతో ఇంట్లో వారికి కోవిడ్19 నిర్ధారణ టెస్టులు చేపించారు. మాళవిక రెండేళ్ల కూతురితో పాటు ఆమె తల్లితండ్రులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తాజాగా చెప్పింది. అయితే మాళవిక తల్లిదండ్రులకు, పాపకు ఏ లక్షణాలు లేకపోవడం వారికి ఊరటనిస్తోంది. డాక్లర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి కరోనా మహమ్మారితో మాళవిక పోరాడుతోంది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి