Weight Loss: బరువు తగ్గడానికి మనం ఎన్నో రకాల డైట్స్ ఫాలో అవుతాం. కానీ అన్ని పాటించాలి అంటే ఒక్కొక్కసారి మనకు కుదరదు. ఈ డైట్స్ క ఒక నెలపాటు చేస్తే ఏదో ఒక కిలో అరకిలో తగ్గే ఆస్కారం ఉంటుంది. మధ్యలో పొరపాటున డైట్ తప్పమంటే ఇంక అసలు బరువు తగ్గం. పెళ్లిళ్లు ,ఫంక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు త్వరగా బరువు తగ్గాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామే ..కానీ ఎలా చేయాలో మనకు తెలియదు. అలా త్వరగా బరువు తగ్గాలి అనుకునే వారి కోసం ఈ యాపిల్ డైట్. ముఖ్యంగా అమ్మాయిలకి ఈ డైట్ ఒక వరం అని చెప్పొచ్చు.. ఎందుకంటే పోషకాహారాలు అందుతూనే స్లిమ్ గా తయారవ్వచ్చు.. మరి ఈ డైట్ గురించి ఒకసారి చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేవలం ఐదు రోజులలో ఈ డైట్ ఉపయోగించి ఐదు కిలోల వరకు బరువు తగ్గవచ్చు. కానీ ఇది తరచూ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. యాపిల్ డైట్ అంటే మనం తినే ఆహారంలో యాపిల్స్ ని చేర్చుకోవడం అని అర్థం. ఐదు రోజులపాటు బయట దొరికే జంక్ ఫుడ్స్.. రైస్, ఆయిల్, షుగర్ ఏమి తీసుకోకూడదు. మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారంలో యాపిల్ ఉండేలా చూసుకోవాలి.


డైట్ అనుసరించే విధానం..


యాపిల్ లో విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ అధిక మోతాదులో ఉంటాయి. పైగా ఇందులో కేలరీలు 80 నుంచి 100 మధ్యనే ఉంటాయి. ఇందులో ఉన్న ఫైబర్ కడుపు నింపిన భావన కలిగిస్తుంది కాబట్టి అతిగా ఏదీ తినలేము. పైగా ఇందులో ఉన్న ఫైబర్ మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది మన నాడీ వ్యవస్థ పై కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి  స్ట్రెస్ తగ్గుతుంది.


రోజు మనం భోజనం చేసే అరగంట ముందు యాపిల్ తీసుకోవడం వల్ల మనం తినే భోజనం పై మనకు అదుపు వస్తుంది. డైట్ మొదలుపెట్టిన ఫస్ట్ డే కంప్లీట్ గా యాపిలే తినాలి. సెకండ్ డే నుంచి వేరే రకాల పండ్లు కూరగాయలతో కలిపి దీన్ని స్మూతీగా, జ్యూస్గా చేసుకుని తాగవచ్చు. కానీ వీలైనంత వరకు కట్ ఫ్రూట్స్ తినడమే మంచిది. అప్పుడే అది మన శరీరంలో జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది. జ్యూస్ అయితే సులభంగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి వెంటనే ఆకలి కలుగుతుంది. అదే పండు రూపంలో తింటే అది ఎక్కువ సేపు ఆకలి కలగనివ్వదు.


గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.


Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు


Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి