జలుబు, దగ్గు అనేవి సహజంగానే కరోనా వైరస్ లక్షణాలు. చలికాలం కావడంతో ఈ లక్షణాలు సాధారణమే. ఈ సమస్యల్నించి కాపాడుకోవాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. మరి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కాడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంట్లో లభించే వివిధ పదార్ధాలతో ఆయుర్వేద కాడా తయారు చేసుకోవచ్చు. ఇందులో ఔషధ గుణాలు అద్భుతంగా ఉంటాయి. పోషకాలతో నిండి ఉండే ఈ పదార్ధాలతో కాడా తయారు చేయవచ్చు. ఆయుర్వేద కాడాను రోజూ తీసుకుంటే శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. వివిధ వ్యాధులు దూరమౌతాయి.


తులసి కాడా


తులసిలో చాలా ఔషధ గుణాలుంటాయి. చాలా రకాల వ్యాధుల్ని తులసి ఆకులు దూరం చేస్తాయి. తులసి కాడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి ఆకుల్లో నల్లి మిరియాలు, పసుపు, గిలోయ్, అల్లం, దాల్చిన చెక్క కలిపి కాడా తయారు చేస్తారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి అంటురోగాల్నించి రక్షించుకోవచ్చు.


వాము కాడా


వాములో పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, కాపర్, ఐరన్ వంటి న్యూట్రియంట్లు ఉంటాయి. వాములో బెల్లం, నల్ల మిరియాలు కలిపి కాడా చేస్తారు. స్వభావరీత్యా ఈ రెండూ వేడి చేస్తాయి. ఫలితంగా చలని దూరం చేసి శరీరానికి అంతర్గతంగా వేడి అందిస్తాయి. వాము కాడాతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. ఫలితంగా వ్యాధులు దూరం చేసుకోవచ్చు.


దాల్చిన చెక్క కాడా


దాల్చినచెక్కలో యాంటీ వైరల్స్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంటల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుతాయి. దాల్చినచెక్క కాడా చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే పోషకాలు అంటువ్యాధుల్ని శరీరం నుంచి దూరం చేస్తాయి. దాల్చినచెక్కను నీళ్లలో వేసి ఉడికించాలి. కాస్త చల్లారిన తరువాత కొద్దిగా తేనె కలుపుకుని తాగితే..జలుబు, దగ్గు వంటి వ్యాధులు దూరమౌతాయి.


Also read; Bald Head Control Tips: బట్టతల వస్తోందా.? అయితే ఇలా చేస్తే చాలు.. ఈ జన్మలో రాదు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook