Bald Head Control Tips: బట్టతల వస్తోందా.? అయితే ఇలా చేస్తే చాలు.. ఈ జన్మలో రాదు..!

How To Control Bald Head: జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న నూనెలను ప్రతిరోజు జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే జుట్టు రంగు మారడం, జుట్టు రాలిపోవడం ఇతర సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 08:59 PM IST
Bald Head Control Tips: బట్టతల వస్తోందా.? అయితే ఇలా చేస్తే చాలు.. ఈ జన్మలో రాదు..!

How To Control Bald Head: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, జుట్టు నరవడం ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరిలో ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణం వాతావరణంలో కాలుష్యం పెరగడమేనని, శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖం అందంగా కనిపించేందుకు తప్పకుండా జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే బట్టతల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు మూలికలతో కూడిన నూనెను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. 

జుట్టు సమస్యలను తొలగించే నూనెలు ఇవే:

1) కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ నూనెను జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు రాలడం వివిధ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. చాలామందిలో తరచుగా జుట్టు విరిగిపోతూ ఉంటుంది అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా కొబ్బరినూనెను వెంట్రుకల కు అప్లై చేయాల్సి ఉంటుంది. 

2) ఆముదం నూనె:
ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి తరచుగా నూనెను వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

3) బాదం నూనె:
బాదం నూనె కూడా జుట్టు డ్యామేజ్ నుంచి రక్షించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తెల్ల వెంట్రుకల సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా జుట్టును మందంగా చేసేందుకు ఇందులో ఉండే విటమిన్ ఈ సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పల్చబడడం ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా బాదాం నూనెను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. 

4) ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ లో కూడా జుట్టును రక్షించే ఎన్నో రకాల గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల నుంచి జుట్టును కాపాడడానికి ఆలివ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పెరుగుదలకు దోహదపడుతుంది. కాబట్టి జుట్టు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ని వినియోగించాల్సి ఉంటుంది.

Also Read: Nasal Vaccine: కొత్త వేరియంట్ భయందోళనలు.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ వచ్చేసింది..   

Also Read: Manchu Family Pays Tribute to Kaikala : కైకాల మరణం.. ప్రశాంత్ నీల్ సంతాపం.. మంచు ఫ్యామిలీ ట్వీట్లు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News