Butter Milk Benefits in Summer: బాప్రే.. మజ్జిగతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవుతారు గురూ!
Butter milk Benefits in Summer: వేసవిలో తాపం తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే పదార్ధాలు లేదా పానీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎండ వేడిమి కారణంగా ఆరోగ్యం పాడవకుండా ఉండే జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. లేకపోతే వేసవి తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడుతుంది.
Butter Milk Banefits in Summer: వేసవి ఎండలు మండిపోతున్నాయి. జూన్ నెల సగం రోజులైపోయినా వర్షం జాడ లేదు సరికదా ఇప్పటికీ వడగాల్పులు, తీవ్రమైన ఉక్కపోత సతాయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని సంరక్షించే పదార్ధాలు లేదా పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాంటి చల్లని పానీయం గురించి తెలుసుకుందాం..
మజ్జిగ ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కల్గించే డైరీ ప్రొడక్ట్. వేసవిలో చల్లని మజ్జిగ తాగడాన్ని దాదాపు అందరూ ఇష్టపడతారు. అంతేకాకుండా దాహం తీరుతుంది. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఉంటే విటమిన్ డి, విటమిన్ బి కారణంగా నీరసం ఆవహించదు. మజిల్స్ బలోపేతమౌతాయి.
శరీరంలోని ఎముకలు, పళ్లు పటిష్టంగా ఉంటాయి. అంతేకాకుండా మజ్జిగ అనేది జీర్ణక్రియను మెరుగుపర్చే అద్భుతమైన ఔషధమని చెప్పాలి. జీర్ణక్రియ మెరుగుపడితే కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకూ తొలగిపోతాయి. మజ్జిగ రుచికరమైందే కాకుండా ఇందులో శరీరానికి కావల్సిన చాలా పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. దీనికోసం మసాలా మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?
మసాలా మజ్జిగను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం 2 కప్పులు పెరుగు, 2 టీ స్పూన్స్ జీలకర్ర పౌడర్, అర టీ స్పూన్ పచ్చి మిర్చి, పావు టీ స్పూన్ పుదీనా ఆకులు, పావు కప్పు కొత్తిమీర, 1 టీ స్పూన్ నల్ల ఉప్పు, కొద్దిగా ఉప్పు అవసరమౌతాయి. ముందుగా పుదీనా, కొత్తిమీర తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
అదేవిధంగా పచ్చిమిర్చి కూడా కోసుకుని ఉంచుకోవాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చితో పాటు పెరుగు, జీలకర్ర పౌడర్, నల్ల ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. రుచి కోసం చివర్లో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. అంతే మీక్కావల్సిన చల్లని మసాలా మజ్జిగ తయారైనట్టే. తాగేటప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్‌తో తాగితే రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యం కలుగుతుంది.
Also Read: Uric Acid Problem: యూరిక్ యాసిడ్ పెరిగిపోతోందా, అల్లం చట్నీ ట్రై చేయండి, ఎలా తయారు చేయాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook