Ginger Chutney for Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది సాధారణంగా కన్పించినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటివి తీవ్రమౌతాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. సులభమైన చిట్కాలతో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ చెప్పడమే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీని కూడా వేగంగా పెంచుతుంది.
మనిషి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి. తగిన మోతాదులో లేకపోతే వివిధ రకాల సమస్యలు వెంటాడుతాయి. శరీరం నుంచి విష పదార్ధాల తొలగింపు ప్రక్రియ సరిగ్గా లేకుంటే..యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. ఫలితంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన డైట్ క్రమపద్ధతిలో ఉంటే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది.
యూరిక్ యాసిడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి 7mg/dl దాటితే ప్రమాదకరం. కంటి నొప్పి, కాలి వేళ్ల నొప్పి, మోకాళ్ల నొప్పి, మడమ నొప్పి లక్షణాలు కన్పిస్తే యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి ఉండవచ్చని అర్ధం.
అల్లం ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా భావిస్తారు. అందుకే అల్లంను అనాదిగా తినే ఆహారంలో భాగంగా చేశారు. అల్లం తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. అందుకే చలికాలంలో ఎక్కువగా ఆ అల్లంతో చేసిన కాడా లేదా అల్లం టీ ఎక్కువగా సేవిస్తుంటారు. అల్లం చట్నీ కూడా వివిధ సమస్యల పరిష్కారంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా శరీరంలో ప్రమాదకర స్థాయిలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తుంది.
Also Read: Low Blood Pressure: ఈ ప్రాణాయామంతో కేవలం 10 రోజుల్లో లో బీపీ మాయం..
అల్లం చట్నీ తయారు చేసేందుకు 100 గ్రాముల అల్లం, 2 చెంచాలు వెల్లుల్లి, 1 చెంచా శెనగపప్పు, 1 చెంచా మినపపప్పు, పావు చెంచా మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 50 గ్రాముల చింతపండు, 100 గ్రాముల బెల్లం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు, అరకప్పు నీళ్లు, తాలింపు సామగ్రి, అవసరమౌతాయి.
ముందుగా అల్లం కడిగి శుభ్రం చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో 2-3 చెంచాల ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో అల్లం ముక్కలు వేసి దాదాపు 2 నిమిషాలు వేగనివ్వాలి. తరువాత ఇందులో కోసిన వెల్లుల్లి వేసి తిరిగి కాస్సేపు వేగించాలి. ఇప్పుడు ఓ గిన్నెలో తీసుకోవాలి. తిరిగి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో శెనగపప్పు, మినపపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. అన్నింటినీ కలిపి బాగా వేగించాలి. ఆ తరవాత ఇందులో ఎండుమిర్చి వేసి స్లో మంటలో వేయించాలి. ఇప్పుడు స్టౌవ్ ఆఫ్ చేసి అన్నింటినీ కలిపి మిక్సీలో ఆడించాలి. ఇందులో వేయించిన అల్లం, వెల్లులి వేయాలి. తిరిగి మరోసారి మిక్సీలో ఆడించాలి. పేస్ట్ లా చేసుకోవాలి. ఆ తరవాత ఇందులో నానబెట్టిన చింతపండు గుజ్జు కలపాలి. ఇందులో కొద్దిగా బెల్లం, ఉప్పు వేసి కలపాలి. తగినంత నీళ్లు పోసి కలపాలి. చివరిగా తాలింపు సామగ్రితో తాలింపు వేసి కలపాలి. అంతే మీకిష్టమైన అల్లం చట్నీ తయారైనట్టే.
రోజూ క్రమం తప్పకుండా కొద్దిగా అల్లం చట్నీ సేవించడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య గణనీయంగా తగ్గుతుంది.
Also Read: Diabetes Control Tips: మధుమేహాన్ని నియంత్రించే సూపర్ ఫుడ్స్ ఇవే! మీరు ట్రై చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook