Brain Tumor Symptoms: చాలామందిలో ఏదైనా సందర్భంలో పనిచేసే క్రమంలో కాళ్లు చేతులు వణికిపోతే బీపీ తగ్గడం బీపీ పెరగడమో అనుకుంటాం. కానీ ఇలా క్రమం తప్పకుండా జరిగితే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ముందుగా ఇలాంటి సంకేతాలే మొదలవుతాయని ఆ తర్వాత బ్రెయిన్ లో కణతులు ఏర్పడి ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. దీనికి సకాలంలో చికిత్స జరిగితేనే మనిషి బతకగలుగుతాడు. లేకపోతే మరణం ఖాయమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రెయిన్ ట్యూమర్ రావడానికి శరీరంలో కొన్ని మార్పులు లక్షణాలు ఏర్పడతాయి. ఆ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

>బ్రెయిన్ ట్యూమర్ వల్ల లక్షణాలు:
>>మాట్లాడడంలో ఇబ్బంది.
>>కంటి చూపు సమస్యలు.
>>సరిగా నిలబడలేకపోవడం.
>>క్రమంగా వాంతులు విరోచనాలు.
>>శరీరంలో కండరాలు కుచించుకుపోవడం.
>>ఎప్పుడు తలనొప్పి.
>>రోజు అలసిపోవడం.
>>మాట్లాడే క్రమంలో స్పృహ కోల్పోవడం.
>>విషయాలు మర్చిపోవడం.


మెదడులో కణతులు ఎలా ఏర్పడతాయి:
మెదడులో కణతులు ఏ వ్యక్తికైనా ఏర్పడవచ్చు అని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. తలలోని మెదడు భాగంలో ఈ కణతి ఒక్కసారి ఏర్పడితే క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఈ గడ్డ పడిపోవడం వంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ గడ్డలు రావడానికి ప్రధాన కారణం అధిక రేడియేషన్కు గురి కావడం వల్లే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రేడియేషన్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


బ్రెయిన్ ట్యూమర్ కు శాస్త్ర చికిత్స ఒకటే:
బ్రెయిన్ ట్యూమర్ వల్ల మెదడులో ఘనతలు ఏర్పడి.. క్రమంగా అవి పెరుగుతూ ఉంటాయి. ఇలా మార్పుల గురి కావడం వల్ల కణాలపై తీవ్ర ప్రభావం పడి అవి దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో శరీర అవయవాలు పనికి రాకుండా పోవడమే కాకుండా కొందరిలో శరీర అవయవాలు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది.


Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..


Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook