Papaya: బొప్పాయి తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు!
Papaya For Weight Loss: బొప్పాయి పండు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Papaya For Weight Loss: ప్రస్తుత కాలం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. పపైన్ తో పాటు ఫైబర్, ఫోలేట్ మరియు విటమిన్ ఎ, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
బరువు తగ్గడంలో దిట్టైన పండు బొప్పాయి. ఇది తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది.
కేలరీలు తక్కువగా:
బొప్పాయి పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
ఫైబర్ కంటెంట్:
బొప్పాయి పండులో ఫైబర్ ఎక్కువుగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల కడుపు నిండిని భావనకలుగుతుంది. అతిగా తినాలనే కోరికను తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడం:
బొప్పాయి పండులో ఉండే ఎంజైమ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన గట్‌ను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
సహజ మూత్రవిసర్జన:
బొప్పాయి సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. అధిక నీటి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
తక్కువ గ్లైసెమిక్ :
బొప్పాయి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను త్వరగా పెంచదు.
విటమిన్లు, మినరల్స్‌తో:
బొప్పాయిలో అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యానికి శక్తి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.
జీవక్రియను పెంచుతుంది:
బొప్పాయిలోని పోషకాలు, విటమిన్ బి, ఆరోగ్యకరమైన జీవక్రియకు తోడ్పడతాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది:
బొప్పాయి పండులో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె జబ్బుల సమస్యలను నివారిస్తుంది. అలాగే బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
హైడ్రేషన్ :
బొప్పాయిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల హైడ్రేటింగ్ పండు. జీవక్రియను పెంచడం, శారీరక శ్రమను ప్రోత్సహించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఈ విధంగా బొప్పాయి పండు బరువు తగ్గడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. అలాగే దీని వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Also Read: Rooh Afza Recipe: వేడి వేసవికి చల్లని ఊరటని ఇచ్చే రూహ్ అఫ్జా షర్బత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter