Summer Drink Rooh Afza Recipe: మండుతున్న ఎండలకు శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీని కారణంగా మనం కూల్ డ్రీంక్స్ ఇతర పదార్థాలను తీసుకుంటాము. అయితే వాటి అన్నిటికి కంటే మేలు చేసే రూహ్ అఫ్జా షర్బత్ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
ఇది తయారు చేయడం చాలా సులభం. ఇంట్లోనే తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. రోజా పువ్వుల యొక్క రుచి వాసనతో, మిమ్మల్ని చల్లగా మరియు రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
రూహ్ అఫ్జా షర్బత్ గురించి:
రూహ్ అఫ్జా అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన జ్యూస్. ఇది ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ్ల నుంచి ఉపశమనం కలిగించేందుకు తాగుతారు. ఈ జ్యూస్‌లో గులాబీల వాసన, రుచి ఉంటుంది. ఇది చాలా చల్లగా ఉంటుంది.
ఇది సాధారణంగా చల్లని నీటిలో కలుపుకొని, నిమ్మరసం, పుదీనా ఆకులతో కలిపి తాగుతారు. కొందరు దీనిని పాలతో కూడా కలుపుకుని తాగుతారు. రూహ్ అఫ్జా వివిధ రకాల డ్రింక్‌లలో కూడా ఉపయోగించబడుతుంది.
కావలసిన పదార్థాలు:
రూహ్ అఫ్జా - 2-3 టేబుల్ స్పూన్లు
చల్లని నీళ్ళు - 1 గ్లాసు
నిమ్మరసం - 1/2 నిమ్మకాయ
పంచదార
పుదీనా ఆకులు
ఐస్ ముక్కలు
తయారు చేయు విధానం:
ఒక గ్లాసులో చల్లని నీళ్ళు తీసుకోండి. ఇందులోకి రూహ్ అఫ్జా, నిమ్మరసం, పంచదార వేసి కలపండి. రుచి చూసి, అవసరమైతే మరింత పంచదార వేసుకోవచ్చు. పుదీనా ఆకులు, ఐస్ ముక్కలు వేసి కలపండి. చల్లగా సర్వ్ చేయండి.
చిట్కా:
పాలు కూడా నీళ్ళకు బదులుగా వాడవచ్చు.
రోజ్ వాటర కొద్దిగా వేసి మరింత రుచి తెచ్చుకోవచ్చు.
చియా విత్తనాలు నానబెట్టి వేసి అదనపు పోషణ, టెక్స్‌చర్‌ను పొందవచ్చు.
ఈ విధంగా మీరు వేసవిలో ఈ జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బయట లభించే డింక్స్ కంటే ఇది ఆరోగ్యకరమైనది, రుచికరమైనదని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter