Cancer Symptoms: మీలో ఈ లక్షణాలున్నాయా, అయితే జాగ్రత్త కేన్సర్ ముప్పు ఉన్నట్టే
Cancer Symptoms: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ అంతుబట్టనిది కేన్సర్ ఒక్కటే. అందుకే కేన్సర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో గుర్తించగలిగితేనే కేన్సర్ నుంచి రక్షణ సాధ్యమౌతుంది. కొన్ని లక్షణాల ద్వారా అప్రమత్తం కావచ్చంటున్నారు వైద్యులు
Cancer Symptoms: కేన్సర్ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. బ్రెస్ట్ కేన్సర్, సర్కోమా కేన్సర్, బ్రెయిన్ ట్యూమర్, యుటెరస్ కేన్సర్, లంగ్ కేన్సర్ ఇలా చాలా రకాలున్నాయి. కేన్సర్ ఏదైనా సరే ముందుగా కొన్ని లక్షణాలు కన్పించవచ్చు. సాధారణంగా అందరూ తేలిగ్గా తీసుకునే లక్షణాలే అవి. కానీ అవే కొంప ముంచవచ్చు. అందుకే ఏ లక్షణాన్నీ తేలిగ్గా తీసుకోకూడదు. ఎలాంటి లక్షణాలు కన్పిస్తే అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం.
కేన్సర్ వచ్చే ముందు చాలా రకాల లక్షణాలు కన్పిస్తుంటాయి. సాధారణంగా ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా అలాంటి లక్షణాలు కన్పిస్తుండటంతో మనం వీటిని తేలిగ్గా తీసుకుంటాం. లేదా ఒక్కోసారి వైద్యులు కూడా నిర్ధారించలేకపోతారు. ముఖ్యంగా కొంతమందికి ఆకలి ఉన్నట్టుండి తగ్గిపోతుంది. ఆకలి అన్పించదు. కొద్దిగా తీన్నా కడుపు నిండినట్టుగా ఉంటుంది. మీరు ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే తగిన పరీక్షలు చేయించుకుంటే మంచిది.
కేన్సర్ వచ్చే ముందు కన్పించే లక్షణాల్లో ఒకటి ఆహార మింగడంలో సమస్య ఏర్పడటం. ఇది గొంతు కేన్సర్ లక్షణాల్లో కీలకమైంది. గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టుగా, అసౌకర్యంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే అలర్ట్ కావాలి. ఎందుకంటే ఈ లక్షణాలుంటే తల, మెడ, దవడ ప్రాంతంలో కేన్సర్ ముప్పు ఉందని అర్ధం.
కొంతమందికి తరచూ వికారం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి. ఇది చాలా సహజంగా కన్పించే లక్షణం. గ్యాస్టిక్ సమస్య అనుకుని వదిలేస్తుంటాం. కానీ ఇది ఒక్కోసారి పొత్తి కడుపు కేన్సర్, ప్యాంక్రియాటిస్ కేన్సర్‌కు హెచ్చరిక కావచ్చు. కొంతమందిలో ఫుడ్ విషయంలో తేడా లేకపోయినా మలబద్ధకం, మల విసర్జనలో సమస్య, డయేరియా రావచ్చు. ఈ లక్షణాలుంటే జాగ్రత్త. వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
కొంతమందికి కడుపులో లేదా ఛాతీలో మంటగా ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం గమనించవచ్చు. ఈ లక్షణాలు సాధారణమే అయినా తేలిగ్గా తీసుకోకూడదు. ఒక్కోసారి ఇది ఫుడ్ పైప్ కేన్సర్ కావచ్చు. ఇక్కడ మనం ప్రస్తావించిన లక్షణాలున్నంత మాత్రాన అన్నీ కేన్సర్ కాకపోవచ్చు. అలాగని సాధారణమనుకుని తేలిగ్గా తీసుకుంటే కేన్సర్ అయి ఉంటే మరింత ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కన్పిస్తే కేన్సర్ కావచ్చనే జాగ్రత్తతో పరీక్షలు చేయించుకుంటే అన్ని విధాలా మంచిది.
Also read: Wrinkles Removal Tips: కొబ్బరి నూనెతో ఈ రెండు కలిపి రాస్తే ముడతలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.