Chia Seeds: రోజూ ఉదయం చియా విత్తనాలను తింటే ఏమి జరుగుతుంది?
Chia Seeds Benefits: చియా గింజలు ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధి పొందిన ఆహారం. దీని చాలా మంది సలాడ్, పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ప్రతిరోజు చియా గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Chia Seeds Benefits: చియా విత్తనాలు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ చియా గింజలు అజ్టెక్ , మాయన్ నాగరికతల కాలం నుంచి ఆహారంగా ఉపయోగిస్తున్నారు. రోజూ ఉదయం చియా విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రోజూ ఉదయం చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ చియా విత్తనాల నీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే అధిక బరువు సమస్యలతో బాధపడేవారు చియా గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి, దీని వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఈ గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా రక్తపోటును తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఎముకల సమస్యతో బాధపడేవారు కూడా ఈ చియా విత్తనాలను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మర్చుతాయి. చియా విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ముడతలు పడకుండా రక్షిస్తాయి. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేసేవారికి చాలా ఉపయోగకరం.
చియా విత్తనాలను తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు తగ్గించడానికి జాగ్రత్తలు:
చియా గింజలు తీసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించడం చాలా అవసరం. అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యలు కలుగాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే చియా గింజలు ఉపయోగించే ముందు ఈ కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి, ముందుగా రోజుకు 15-30 గ్రాములకు మించి చియా విత్తనాలు తీసుకోవద్దు. దీని వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినవచ్చు. కొంతమందికి చియా విత్తనాలకు అలెర్జీ ఉండవచ్చు. అలెర్జీ లక్షణాలు కనిపిస్తే వాటిని వెంటనే తీసుకోవడం ఆపివేయండి రక్తం పలుచబడే మందులు వాడుతున్నవారు చియా విత్తనాలను జాగ్రత్తగా తీసుకోవాలి. చియా విత్తనాలు నీటిని గ్రహించి ఉబ్బుతాయి. కాబట్టి వాటిని నీటితో సరిగా తీసుకోకపోతే ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమైన విషయాలు:
చియా విత్తనాలను తీసుకునే ముందు మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూచించిన మోతాదును మించి తీసుకోకండి. చియా విత్తనాలను తీసుకున్న తర్వాత తగినంత నీరు తాగడం ముఖ్యం.
ముగింపు:
చియా విత్తనాలు ఆరోగ్యకరమైన ఆహారం. రోజూ ఉదయం చియా విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
Also read: Coconut Water: కొబ్బరి నీళ్ల రోజూ తాగితే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter