Chironji Benefits: చిరోంజీ ఢ్రై ఫ్రూట్ గురించి విన్నారా..సాధారణంగా స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తారు. కానీ పాలలో కలిపి రోజూ తాగితే కలిగే అద్భుతాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలను ఎప్పుడూ కంప్లీట్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో శరీరానికి అవసరమైన దాదాపు అన్ని రకాల పోషక పదార్ధాలుంటాయి. ఫలితంగా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదే పాలలో చిరోంజీ డ్రై ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే న్యూట్రిషనల్ విలువ మరింతగా పెరుగుతుంది. సాధారణంగా స్వీట్స్ తయారీలో రుచి కోసం వాడే చిరోంజీ డ్రై ఫ్రూట్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా తక్కవమందికి తెలుసు. పాలతో కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..


విషపూరిత పదార్ధాల తొలగింపు


చిరోంజీ డ్రై ఫ్రూట్ అంటే వాస్తవానికి ఇవి విత్తనాలు. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నా అద్భుతమైన పోషక గుణాలు కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. వీటిని పాలలో కలిపి తీసుకుంటే శరీరంలోని విష పదార్ధాలు బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా బాడీ క్లీన్ అవుతుంది. 


డయేరియాకు చికిత్సగా..


విరేచనాల సమస్యకు చిరోంజీ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డయేరియా పట్టుకున్నప్పుడు చిరోంజీ విత్తనాలు మంచి ఫలితాలనిస్తాయి ఖిచిడీలో కూడా కలిపి వండవచ్చు. చిరోంజీ విత్తనాల్ని పౌడర్ చేసుకుని..పాలలో కలిపి తాగవచ్చు. 


ఇమ్యూనిటీ పెంచడంలో..


కరోనా వైరస్ మహమ్మారి సమయం నుంచి అందరికీ ఇమ్యూనిటీపై శ్రద్ధ ఎక్కువైంది. ఇమ్యూనిటీ అవసరం కూడా తెలిసింది. ఈ క్రమంలో పాలు, చిరోంజీ పౌడర్ మిశ్రమంతో ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ బలంగా ఉంటే ఏ విధమైన వైరల్ ఫీవర్లు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.


డయాబెటిస్ నియంత్రణకై..


ప్రస్తుతం వివిధ రకాల కారణాలతో డయాబెటిస్ సమస్యగా మారుతోంది. మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచేందుకు చిరోంజీ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది.


Also read: Cholesterol Control Tips: కేవలం 5 రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook