Cholesterol Control Foods: మన కిచెన్ లో ఉండే కొన్ని వస్తువులతో కూడా రక్తంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించుకోవచ్చు. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగి, చెడు కొలెస్ట్రాల స్థాయిలు తగ్గించుకోవాలి. ఫలితంగా ఏ ఆరోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం తీసుకునే ఆహారం నుంచి రాత్రి డిన్నర్ వరకు సరైన పోషకాలు ఉండే ఆహారాలు ఆరోగ్యకరంగా ఉండాలి. మన వంట గదిలో నిత్యం అందుబాటులో ఉండే ఓ మూడు వస్తువులు చెడు కొలెస్ట్రాల్‌ను నామరూపం లేకుండా చేస్తాయి అవేంటో తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లుల్లి..
వెల్లుల్లి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను  తగ్గిస్తాయి. వీటిని సూప్ రూపంలో తీసుకోవచ్చు. కూరలో వేసుకోవచ్చు. వెల్లుల్లిని వెజిటేబుల్స్ లో కూడా కలిపి వండుకోవచ్చు. వెల్లుల్లి పొడి కూడా అందుబాటులో ఉంటుంది. వెల్లుల్లి డైట్ లో చేర్చుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని అల్లిసిన్  ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది..


పండ్లు..
పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ లో చేసుకోవాలి. ముఖ్యంగా లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉండేవి తీసుకుంటే మంచిది. నీటి శాతం అధికంగా ఉండే పండ్లు డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి. పండ్లను మనం యోగార్ట్‌తో తీసుకోవచ్చు. ఉదయం ఏదైనా ఓట్స్ తో పాటు కూడా తీసుకోవచ్చు. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేసి, మంచి కొలెస్ట్రాల్ నిర్వహించేలా చేస్తాయి. పండ్లు తింటే ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా కనిపిస్తుంది.. త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించవు.


ఇదీ చదవండి:  ఉదయం మీకు ఉండే ఈ 5 చెడు అలవాట్లే బరువు పెరగడానికి అసలు కారణం..


బాదాం..
గింజలను మన డైట్ లో తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇది పోషకాలకు పవర్ హౌస్ ఇందులో మెగ్నీషియం , జింక్ వంటివి ఉంటాయి. ఈ ఖనిజాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి. అంతేకాదు మంట సమస్య రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి... బాగా గాన పెట్టి తీసుకోవడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయి... ఇవి రక్తంలో మంచి కొలెస్ట్రాల స్థాయిలను పెంచుతాయి. అంతే కాదు గుండె సమస్యలు రాకుండా కాపాడతాయి ...ఇది బెల్లీ ఫ్యాట్ కి కూడా ఎఫెక్టివ్ రెమిడి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో బాదం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు పోషకాలకు పవర్ హౌస్ ఆయన బాదాం నీ సలాడ్ డెసర్ట్ లో తీసుకోవాలి వీటిని స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు...


ఇదీ చదవండి: ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు.. పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..


 ఫలితంగా అనేక లాభాలు ఉంటాయి బాదాం ను రాత్రి నానబెట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్ లో తీసుకుంటే ఎఫెక్ట్ ఫలితాలు పొందుతారు.ఈ మూడు మన నిత్యం వంటగదిలో అందుబాటులో ఉంటాయి... ఇవి కాకుండా సరైన ఆరోగ్యం నిర్వహించడానికి వెయిట్ నిర్వహణకు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని రకాల తృణధాన్యాలు కూడా డైట్లో చేర్చుకోవాలి.. ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ తో పాటు రాత్రి తీసుకునే డిన్నర్ వరకు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి పోషకారానికి ప్రదాన ప్రాధాన్యత ఇవ్వాలి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.