Weight Gain Morning Mistakes: బరువు తగ్గడానికి ఎన్నో విధాలు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా లైఫ్ స్టైల్ సరిగ్గా ఉంటే ఏ సమస్యలు రావు. పోషకాహారం తీసుకోవాలి కొన్ని రకాల ఫ్యాటీ ఫుడ్స్ కి దూరంగా ఉంటే బరువు పెరగరు. అయితే సాధారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సరైన లక్షణాలు పాటించకపోవడం వల్ల బరువు విపరీతంగా పెరుగుతారు. మనకు ఉండే కొన్ని అలవాట్ల వల్ల బరువు సులభంగా పెరిగిపోతారు. అతిగా తినకున్నా ఏ ఆరోగ్య సమస్య లేకుండా బరువు పెరిగిపోతూ ఉంటారు. దీంతో వేలు స్ట్రెస్ కి గురవుతారు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే ఉదయం మీరు పాటించే కొన్ని అనారోగ్య అలవాట్లు మీరు బరువు విపరీతంగా పెరగడానికి అసలు కారణం. అవేంటో తెలుసుకుందాం.
ఉదయం మనం తీసుకునే ఆహారం రోజంతటిపై ప్రభావం పడుతుంది. అందుకే ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా ఉండేలా చూడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇది బరువు పెరగడానికి కూడా అసలు కారణం అవుతుంది. అయితే ఉదయం పూట చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం...
కొందరు ఉదయం పూట పని హడావిడిలో ఆఫీస్ కి టైం అవుతుందని హడావుడిలో బ్రేక్ఫాస్ట్ తినడం మానేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదం బ్రేక్ఫాస్ట్ తినని వారిలో మెటబాలిజం రేటు నెమ్మదిస్తుంది. దీనితో వీరు తర్వాత అతిగా తింటారు బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఉదయం తప్పకుండా బ్రేక్ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూసుకోవాలి.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో చెక్కర అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే కూడా ప్రమాదం కాఫీ జ్యూస్ ఇతర వాటిలో చక్కర అధికంగా ఉండేలా చూడకూడదు. దీంతో బరువు అతిగా పెరిగిపోతాడు ఆయిల్ ఫుడ్‌కు వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఉదయం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా లైట్ గా ఉండాలి. ఇది రోజంతటి పై ప్రభావం జరుగుతుంది.
ఉదయం ఎక్కువగా నీరు తీసుకోవాలి. మీరు తక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పడిపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. క్యాలరీలు బర్న్ చేయడంలో మీరు అత్యధికంగా పనిచేస్తుంది. జీర్ణక్రియకు కూడా ఇది తోడ్పడుతుంది. ఉదయం సరైన మోతాదులో నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ముఖానికి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలు.. పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..
కార్బొహైడ్రేట్ అతిగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొంతమందికి ఉదయం అన్నం తిని అలవాటు ఉంటుంది. చక్కెర అతిగా ఉండే ఆహారాలు, పేస్ట్రీలు తింటారు అధికంగా ఉండే ఆహారాలు డైట్ లో చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా బరువు కూడా పెరిగిపోతారు కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
కొంతమంది అతిగా నిద్రపోతారు. సరైన నిద్ర అందరికీ అవసరం కానీ అతిగా నిద్రపోయే వాళ్ళు వారి వారికి కూడా బరువు పెరిగే అవకాశం విపరీతంగా ఉంటుంది. అంతేకాదు బిజీ లైఫ్ స్టైల్ వల్ల కొంత మంది ఫిజికల్ యాక్టివిటీకి దూరంగా ఉంటారు. దీని వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎక్సర్‌సైజ్ చేస్తేనేఎనర్జీ లెవెల్స్ ని పెంచుతాయి క్యాలరీలను కరిగించేస్తాయి. వర్కౌట్లకు దూరంగా ఉండటం వల్ల కూడా బరువు సులభంగం పెరిగిపోతారు..
ఇదీ చదవండి: ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు.. మీరు అస్సలు నమ్మలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.