Corn Health Benefits: జొన్నరొట్టె ఒక్కటి తింటే చాలు, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్
Corn Health Benefits: ఆధునిక జీవనశైలి వ్యాధులైన అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు. కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్లో చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు మొక్కజొన్న రొట్టెలు అద్భుతంగా పనిచేస్తాయి. జొన్న రొట్టెల్లో పుష్కలంగా ఉండే పోషక పదార్ధాలతో వివిధ రకాల వ్యాధులు నయం చేయవచ్చు. జొన్న రొట్టెలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
జొన్నను రొట్టెలతో పాటు మొక్కజొన్న, సూప్, స్నాక్స్, కూరల రూపంలో తీసుకోవచ్చు. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలేనియం, విటమిన్ ఎ వంటి పోషకాలు చాలా ఎక్కువ. అందుకే మొక్కజొన్న తీసుకోవడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఏర్పడే వివిధ ప్రోటీన్, విటమిన్ లోపాన్ని సరిజేస్తుంది.
ఎనీమియాకు చెక్
శరీరంలో ఎర్ర రక్త కణాల లోపించడం వల్ల ఎనీమియా సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను నిర్మూలించేందుకు మొక్కజొన్న అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్ ఎనీమియాను దూరం చేసేందుకు దోహదపడుతుంది. శరీరంలో రక్త హీనత ఏర్పడితే మొక్కజొన్నలు అద్భుతమైన పరిష్కారం చూపిస్తాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ
మొక్కజొన్నలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించేందుకు మొక్కజొన్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మొక్కజొన్న తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా ఉంటుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుంది.
కంటి ఆరోగ్యం
మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల కంటి ఆరోగ్యానికి దోహదమౌతుంది. ఇందులో కైరోటినాయిడ్, విటమిన్ ఎ పెద్దమొత్తంలో ఉంటుంది. కంటి ఆరోగ్యానికి , కంటి చూపుకు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అధిక రక్తపోటుకు చెక్
అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ వంటి సమస్యలతో బాధపడేవారికి మొక్కజొన్న రొట్టెలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ బి అధిక రక్తపోటుకు చెక్ పెట్టేందుకు సహాయపడుతుంది.
Also read: Weight Loss Diet: ఈ 4 చిట్కాలతో బెల్లీ ఫ్యాట్, శరీర బరువుకు వేగంగా బైబై చెప్పొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook