COVID-19 Vaccination: మీకు దగ్గర్లోని కోవిడ్19 టీకా కేంద్రాన్ని WhatsApp ద్వారా తెలుసుకోండి
Nearest COVID-19 Vaccination Centre: కోవిడ్19 మరణాలు సైతం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకుగారూ 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశలో కరోనా వ్యాక్సిన్ మొదలైంది.
ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్19 మరణాలు సైతం ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకుగారూ 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశలో కరోనా వ్యాక్సిన్ మొదలైంది.
కరోనా వ్యాక్సిన్ డోసులు ఉన్న రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తమ వద్ద టీకా నిల్వలు లేని కారణంగా యువతకు ఇప్పట్లో టీకాలు ఇవ్వలేమని, కేంద్రం తమకు కోవిడ్19 వ్యాక్సిన్ మోతాదులు పంపితేనే నిర్ణయం తీసుకోగలమని చెబుతున్నాయి. మీకు దగ్గర్లోని కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వాట్సాప్ సర్వీసు అందుబాటులోకి తెచ్చింది. దాని ద్వారా మీరు మీకు సమీపంలో ఉన్న కరోనా టీకాల కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు.
మీకు దగ్గర్లోని కరోనా కేంద్రాన్ని ఇలా తెలుసుకోండి..
- మొదటగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కరోనా హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్ చాటింగ్‌లో ఆ కాంటాక్ట్ నెంబర్ ఓపెన్ చేసి నమస్తే లేదా హాయ్(Hi) లేదా Hello లాంటి ఏదైనా ఒక పదాన్ని టైప్ చేయాలి
- మీ హలో మెస్సేజ్ సెండ్ అయిన వెంటనే మీ మొబైల్‌కు ఆటోమేటెడ్ మెస్సేజ్ వస్తుంది. 1 అందులో కరోనా వ్యాక్సినేషన్, 2 కరోనా వైరస్ లేటెస్ట్ వివరాలు, 3 రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు నిపుణుల సలహా లాంటి ఆప్షన్లు మీకు కనిపిస్తాయి.
- మీరు రిప్లై 1 అని ఇవ్వాలి. దాంతో కోవిడ్ కేంద్రాలకు, కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి అధికారిక సమాచారం వస్తుంది. ఆ తరువాత మరోసారి 1 అని రిప్లై ఇస్తే కరోనా కేంద్రాలకు సంబంధించి వివరాలు మీకు అందుతాయి
Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి
- అనంతరం మీ ప్రాంతానికి సంబంధించిన 6 అంకెల పిన్ కోడ్(Pin Code) నమోదు చేయాలి
- మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీకు సమీపంలోని కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు, తేదీలు, ఏ రోజున ఎన్ని స్లాట్లు ఉన్నాయో మీకు అందుతాయి.
- ఆ మెస్సేజ్‌లోనే మీకు కోవిన్ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకునేందుకుగానూ లింక్ సైతం ఉంటుంది. లిక్ మీద క్లిక్ చేసి కరోనా టీకా కోసం మీరు రిజిస్టర్ చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా టీకాలు తీసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook