Dr Reddys Covid-19 Drug 2-DG: కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత రక్షణ సంస్థ డీఆర్‌డీఓ తన వంతుగా చేసిన ప్రయత్నం 2-DG (2-డియాక్సీ డి-గ్లూకోజ్‌). డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సహకారంతో రూపొందించిన ఈ యాంటీ కోవిడ్19 ఔషధం 2-డీజీని క‌మ‌ర్షియ‌ల్‌గా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ మేరకు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాచెట్స్ రూపంలో లభించే ఈ యాంటీ కోవిడ్19 డ్రగ్ రెండు నెల‌ల క్రితం ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ హర్షవర్ధన్‌ విడుదల చేశారు. 2డీజీ డ్రగ్‌ను కరోనా బాధితులకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ సైతం ఇటీవల అనుమతి ఇచ్చింది. డీఆర్‌డీవో రూపొందించిన 2డీజీ ఔష‌ధాన్ని రెడ్డిస్ ల్యాబ్ సాచెట్స్ రూపంలో తయారు చేసింది. ఈ ఔషధాన్ని మార్కెట్లోకి వాణిజ్యపరంగా విడుదల చేశారు. మొదగటా టైర్ 1 నగరాలలో 2డీజీ మెడిసిన్ అందుబాటులోకి తీసుకురానున్నామని రెడ్డీస్ ల్యాబోరేటరిస్ (Dr Reddys Laboratories) తెలిపింది. దేశ వ్యాప్తంగా అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రైవేట్ ఆసుపత్రులలో త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు.


Also Read: Benefits Of Carrots: కోవిడ్19 సమయంలో క్యారెట్ తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు


డీఆర్‌డీవో రూపొందించిన కోవిడ్19 ఔషధం 2డీజీ ధర రూ.999గా నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు కొంత తగ్గింపు ధరలకు అందుబాటులోకి తేనున్నామని రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ ఔషధాన్ని నేరుగా నోటిద్వారా తీసుకోవచ్చునని చెప్పారు. డాక్టర్లు సూచించిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఉంటే, కోవిడ్19 (Covid-19) బాధితుల చికిత్స నిమిత్తం మొదటగా వారికే అందేలా సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ 2డీజీ మెడిసిన్ మే 1వ తేదీనే అత్యవసర వినియోగానికి ఆమోదం పొందడం తెలిసిందే. డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ ఈ 2డీజీ యాంటీ కరోనా డ్రగ్‌ను తయారు చేసింది.


Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook