Cranberries Benefits: క్రాన్బెర్రీస్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే బిత్తరపోతారు.. మీరూ తెలుసుకోండి..
Cranberries Health Benefits: క్రాన్బెర్రీస్ ఎర్ర రంగులో ఉంటాయి ఇవి రుచికి కాస్త పులుపుగా తీయగా ఉంటాయి. ఇది అమెరికా నార్త్ అమెరికా ప్రదేశాల్లో పెరుగుతాయి వీటిని పచ్చిగా లేదా జ్యూస్ చేసుకుని డ్రైగా కూడా తింటారు. ఇందులో ఖనిజాలు, విటమిన్ సి, విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి.
Cranberries Health Benefits: క్రాన్బెర్రీస్ లో ప్రోటీన్, ఫైబర్, ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు యుటిఐ సమస్యను నివారించే ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.
క్రాన్బెర్రీస్ ఎర్ర రంగులో ఉంటాయి ఇవి రుచికి కాస్త పులుపుగా తీయగా ఉంటాయి. ఇది అమెరికా నార్త్ అమెరికా ప్రదేశాల్లో పెరుగుతాయి వీటిని పచ్చిగా లేదా జ్యూస్ చేసుకుని డ్రైగా కూడా తింటారు. ఇందులో ఖనిజాలు, విటమిన్ సి, విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు క్రాన్ బెర్రీస్ గుండె ఆరోగ్యానికి సహాయ పడతాయి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది
ముఖ్యంగా క్యాన్ బెర్రీలో 90% నీరు ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్స్ ఫైబర్ విటమిన్స్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్ పుష్కలం..
ఇతర కూరగాయలు, పండ్లల క్రాన్బెర్రీస్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్పలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. క్యాన్సర్ కణాలను కూడా నివారించే గుణం క్రాన్బెర్రీస్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ కార్సినోజెనిక్ ,యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీసెప్టిక్ ,యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి.
యాంటీ ఏజింగ్..
క్రాన్ బెర్రీలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ లో మంట సమస్యను తగ్గిస్తాయి. దీంతో త్వరగా వృద్ధాప్య సమస్యలు రావు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నివారిస్తుంది. ముఖ్యంగా ఇది కొల్లాజెన్ ఉత్పత్తి కూడా తోడ్పడుతుంది. చర్మంపై మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. కొన్ని నివేదికల ప్రకారం క్రాన్బెర్రీస్ లో ఉండే ఫాలిఫైనల్స్, యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించవు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్..
యూటీఐ సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళల్లో ఈ వ్యాధి కనిపిస్తుంది అయితే క్రాన్బెర్రీస్ జ్యూస్ లేదా నేరుగా తినడం వల్ల ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్ పెట్టవచ్చు.
ఇదీ చదవండి: ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..
గుండె ఆరోగ్యం..
గుండె సమస్యల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. క్రాన్బెర్రీస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ , ఆంథోసైనిన్‌తో వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. క్రాన్ బెర్రీస్ లో మంట సమస్య తగ్గించి కొలెస్ట్రాల్ని మెరుగుపరుస్తుంది. గుండె సమస్యలు దరిచేరువు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ , బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది.
క్యాన్సర్..
క్రాన్ బెర్రీ లో కొన్ని రకాల క్యాన్సర్లకు ఇది యాంటీ క్యాన్సర్ గా పని చేస్తుంది 17 రకాల క్యాన్సర్లకు ఆ వ్యతిరేకంగా పోరాడుతుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్ వంటి కణాలు పెరగకుండా వ్యతిరేకంగా పోరాడుతాయి.
కంటి ఆరోగ్యం..
క్రాన్ బెర్రీ జ్యూస్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, గ్జీయాంథీన్ ఉండటం వల్ల కంటే ఆక్సిడేటీవ్ డామేజ్ కాకుండా అల్ట్రా వైలట్ రేస్ నుంచి మన కంటిని కాపాడుతుంది.
ఇదీ చదవండి: ఈ ఉల్లిపాయలు ఆరోగ్యానికి హానికరం.. వండుకునే ముందు తస్మాత్ జాగ్రత్త..!
పేగు ఆరోగ్యం..
క్రాన్ బెర్రీలు, ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ముఖ్యంగా ఉండే ఫైబర్ ఫ్రీ బయోటిక్స్ పేగు మంచి ఆరోగ్యకరమైన ఘట్ హెల్త్ కు తోడ్పడుతుంది దీంతో జీర్ణ సమస్యలు రావు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి