Curry Leaves For BP: బీపీ కంట్రోల్ చేసే ఆకులు ఇవే..రోజు ఇలా చేయండి!
Curry Leaves For BP: కరివేపాను ప్రతి రోజు ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
Curry Leaves For BP: రుచికరమైన వంటకాలకు భారతదేశం పుట్టినిళ్లు..ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో కూడా భారతీయ వంటకాలకు మంచి ప్రాముఖ్య ఉంది. ఆహారాలు రుచిగా మారడానికి మసాల ఎంత సహాయపడుతుందో కరివేపాకు కూడా అంతే కీలక ప్రాత పోషిస్తుంది. ఈ ఆకులు మంచి సువాసన కలిగి ఉండడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా దీనిని ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ప్రస్తుతం చాలా మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి వారు ప్రతి కరివేపాకు రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు హైపర్‌టెన్షన్ వల్ల వచ్చే గుండెపోటు సమస్యలు కూడా దూరమవుతాయి.
యాంటీ ఆక్సిడెంట్స్:
కరివేపాకులో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ ఆకులను ఆహారాల్లో వినియోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో పాటు వాపు, నరాల బలహీనత సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
పొటాషియం కంటెంట్:
కరివేపాకు పొటాషియం కూడా లభిస్తుంది. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని పొటాషియం, సోడియం ప్రభావాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్య కూడా ప్రభావితమవుతుంది. దీంతో సులభంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
వాసోడైలేషన్:
కరివేపాకు అనేక పోషకాల సమ్మేళనాలు లభిస్తాయి. వాసోడైలేషన్‌ను ప్రోత్సహించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ధమని గోడలపై ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి