COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Dates With Milk Benefits: ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఇది శరీరానికి ఔషధంగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఐరన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా భారీగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఎంతో యాక్టివ్‌గా తయారవుతుంది. అయితే వీటిని షేక్‌లా తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.


ఎముకలకు చాలా మేలు చేస్తుంది:
ఖర్జూర, పాలను రెండింటిని షేక్‌లా తయారు చేసి ప్రతి రోజు తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు కూడా దూరమవుతాయి. 


ఒత్తిడి నుంచి ఉపశమనం:
ఖర్జూరను తినడం వల్ల ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు న్యూరోడెజెనరేటివ్ డిసీజ్‌ నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది:
ప్రతి రోజు ఖర్జూరను తీసుకోవడం వల్ల గుండెకు చాలా రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ షేక్‌ను ప్రతి రోజు తాగడం వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. 


కీళ్ల నొప్పులకు మేలు చేస్తుంది:
కీళ్లలో వాపు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు డేట్ షేక్‌ని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు వాపులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. 


జీర్ణ సమస్యలకు మేలు చేస్తుంది:
తీవ్ర జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఖర్జూరం షేక్‌ని తాగడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఇందులో ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. దీంతో ఈ షేక్‌ను తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి