Diabetes Control In 14 Days: ప్రస్తుతం జీవనశైలిలో వేగంగా మార్పులు వస్తున్నాయి. దీని కారణంగా చాలామంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకొని మధుమేహం వ్యాధికి గురవుతున్నారు.  దీని కారణంగా చాలామంది దీర్ఘకాలిక వ్యాధులకు కూడా గురవుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎంత తొందర గా బయటపడితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా చిట్కాలను ఉపయోగించి బయటపడవచ్చు. ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం అదుపులో ఉండడానికి రసాలను తీసుకోవాల్సి ఉంటుంది:
మధుమేహం నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. లేకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిపుణులు సూచించిన ఔషధ మూలికలతో ఉపశమనం పొందవచ్చు.  అంతేకాకుండా కొన్ని రకాల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.


ఉసిరి రసం:
ఉసిరి రసం మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెరను సులభంగా నియంత్రిస్తాయి.


కొబ్బరి నీరు:
ఇది అన్ని కాలాల్లో లభించే ఔషధాలు కలిగి ఉన్న నీరు. ఇందులో ఉండే మూలకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తంలోని చక్కెరను నియంత్రించేందుకు ప్రభావంతంగా కృషి చేస్తుంది. కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ నీటిని తీసుకోవాల్సిందిగా నిపుణులు చెబుతున్నారు.


గ్రీన్ టీ:
సాధారణంగా ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీ ని ఉదయం పూట తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేయకూరుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడేవారి కి ఇది ఔషధంలా పనిచేస్తుంది మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి చాయ్ కి బదులుగా ఈ టీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


కాకరకాయ రసం:
కాకరలో శరీరానికి కావలసిన ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా.. శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ రసాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..


Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook