Beerakaya Palli Curry For Diabetes: ప్రస్తుతం భారత్ లో డయాబెటిస్తో లేని కుటుంబం లేదు.. ప్రతి పది కుటుంబాల్లో 9 కుటుంబ సభ్యులు అని ఒకరో ఇద్దరో మధుమేహంతో బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాధి తీవ్ర అంటువ్యాధిగా మారింది. చిన్న పెద్ద తీయడానికి అందరిలోనూ ఈ వ్యాధి రూపాంతరం చెందుతోంది. మధుమేహంతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు జాగ్రత్తలతో పాటు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా ఎక్కువగా నూనె గల ఆహారాలు, వేయించిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరు తీసుకునే రోజు వారి ఆహారంలో బీరకాయతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తంలోని చక్కర పరిమాణాలను సులభంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీరకాయతో చేసిన ఈ క్రింది అద్భుతమైన రెసిపీలను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.


మధుమేహం ఉన్నవారు తప్పకుండా ఈ రెసిపీ ని తీసుకోవాలి:
బీరకాయ పల్లీ కర్రీ:

బీరకాయ పల్లి కర్రీ నోటికి రుచి అందించడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు పోషకాలు రక్తం భూమి చక్కర పరిమాణాలను నియంత్రించి మధుమేహం తీవ్రతరం కాకుండా నియంత్రిస్తాయి. అయితే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా


బీరకాయ పల్లి కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:


  • 1/2 కేజీ బీరకాయ ముక్కలు

  • రుచికి సరిపడా ఉప్పు

  • రెండు టీ స్పూన్ల యాలకుల పొడి

  • ఒక టీ స్పూన్ మిరపపొడి

  • రెండు రెమ్మల కరివేపాకు

  • ఫ్రైకి సరిపడా ఉల్లిపాయ ముక్కలు

  • చిటికెడు ఇంగువ

  • పోపు దినుసులు

  • రెండు టేబుల్ స్పూన్ల నూనె

  • ఒక కప్పు పల్లీల పొడి

  • ఒక కట్ట కొత్తిమీర


బీరకాయ పల్లి కర్రీ తయారీ విధానం:
ముందుగా మిక్సీ జార్లో వేయించిన వేరుశనగపొడిని వేసుకోవాలి అందులోనే కొబ్బరి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ పై ఒక బాణలి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి.
ఇలా వేడెక్కిన తర్వాత పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దోరగా వేగిన తర్వాత..ధనియాల పొడి ఉప్పు మిరప్పొడి వేసుకొని ఐదు నిమిషాల పాటు మళ్లీ దోరగా వేయించుకోవాలి. 
ఆ తర్వాత బీరకాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే క్రమంలో బీరకాయలు మగ్గుతాయి.
ఇలా ముక్కలు బాగా మగ్గిన తర్వాత వేరుశనగలతో తయారుచేసిన పొడిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపి.. కూర పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి తినొచ్చు.
ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు రోటీలతో పాటు ఈ కర్రీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook