ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో డయాబెటిస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. డయాబెటిస్ నియంత్రణ అనేది పూర్తిగా మనచేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో 4 రకాల చిట్కాలు పాటిస్తే..అసలు డయాబెటిస్ అనేది జీవితంలో దరిచేరదంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో డయాబెటిస్ అన్ని వయస్సులవారికి సోకుతోంది. డయాబెటిస్ ఒకసారి సోకిందంటే..జీవితాంతం వెంటాడుతుంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా..నియంత్రణలో ఉంచవచ్చు. దీనికోసం ఆయుర్వేదంలో 4 చిట్కాలున్నాయి. ఇవి పాటిస్తే డయాబెటిస్ జీవితంలో దరిచేరదంటున్నారు.


రోజూ 20 నిమిషాల ఎక్సర్‌సైజ్


డయాబెటిస్‌ను జీవితం నుంచి దూరం చేసేందుకు ఎక్సర్‌సైజ్ కీలకంగా మారింది. రోజూ శారీరక శ్రమ లేకపోతే వ్యాధులు త్వరగా సోకుతుంటాయి. దీన్నించి కాపాడుకునేందుకు రోజుకు 2 కిలోమీటర్లు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాకింగ్ సాధ్యం కాకపోతే..2-3 అంతస్థుల మెట్లను ఎక్కడం, దిగడం చేయాలి. దీనివల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. అటు స్థూలకాయం కూడా పోతుంది. 


డైట్ ఛార్ట్‌లో మార్పులు


రోజంతా కూర్చుని ఉండే ఉద్యోగాలు చేసేవారు కచ్చితంగా లైఫ్‌స్టైల్ మార్చాలి. మధ్య మధ్యలో అటూ ఇటూ తిరగడం అలవాటు చేసుకోవాలి. దాంతో పాటు ఉదయం లేదా రాత్రిపూట కనీసం ఓ అరగంటైనా వ్యాయామం చేయాలి. స్వీట్స్ వంటివాటికి పూర్తిగా దూరం పాటించాలి. వ్యాయామం లేకపోతే బరువు పెరిగిపోతారు. మరోవైపు తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, బీన్స్ వంటి పదార్ధాలు మాత్రమే తీసుకోవాలి. 


జీవితంలో ఎప్పటికీ డయాబెటిస్ సోకకుండా ఉండేందుకు కొన్ని రకాల ఆయుర్వేద డ్రింక్స్ సేవించడం అలవాటు చేసుకోవాలి. ఇందులో కాకరకాయ, నేరేడు, ఉసిరి జ్యూస్ చాలా మంచివి. ఇవి రుచిలో కాస్త చేదుగా ఉన్నా..బ్లడ్ షుగర్‌ను ఎప్పటికీ నియంత్రణలో ఉంచడంలో చాలా దోహదపడతాయి. ఉదయం, సాయంత్రం ఈ జ్యూస్ తాగితే డయాబెటిస్ దూరం కావడమే కాకుండా..కడుపు సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి.


మానసిక ఒత్తిడిని జయించడం


ఏ విధమైన ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి. లేకపోతే పలు వ్యాధులు చుట్టుముడతాయి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకూడదు. అలా ఆందోళనకు గురవుతుంటే డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సీరియస్ వ్యాధులకు గురి కావచ్చు. అందుకే సాధ్యమైనంతవరకూ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా డయాబెటిస్ నియంత్రించవచ్చు.


Also read: Diabetes: మధుమేహం ఉంటే..ఆ పండ్లు పొరపాటున కూడా తినొద్దు, లేకపోతే ప్రమాదమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook