పండ్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్థులు మాత్రం అన్ని రకాల పండ్లు తినకూడదు. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. అసలు డయాబెటిస్ రోగులు ఏయే పండ్లను తినకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్. ఇప్పుడీ వ్యాధి చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. డయాబెటిస్ రోగులకు కిడ్నీ సమస్య, గుండెపోటు, స్ట్రోక్, ఇతర అంగాలపై దుష్ప్రభావం పడనుంది. అందుకే డయాబెటిస్ రోగులు ఆహారపదార్ధాలపై శ్రద్ధ పెట్టాలి. సాధారణంగా ప్రకృతిలో లభించే పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఫైబర్, విటమిన్లు ఇతర రోగాల్నించి కాపాడుతాయి. కానీ డయాబెటిస్ రోగులు మాత్రం కొన్ని రకాల పండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఎందుకంటే ఇవి తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. ఏయే పండ్లను తినకూడదో పరిశీలిద్దాం..
డయాబెటిస్ రోగులు తినకూడని పండ్లు
పుచ్చకాయ
పుచ్చకాయ రుచిగా ఉండటమే కాకుండా శరీరంలో నీటి కొరతను తీరుస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిదైనా డయాబెటిస్ రోగులకు మాత్రం ఇది ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే పుచ్చకాయ అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్థులైతే పుచ్చకాయకు దూరంగా ఉండటం మంచిది.
పైన్ యాపిల్
పైనాపిల్ చాలామంది ఇష్టపడే ఫ్రూట్. పైనాపిల్‌లో పంచదార శాతం అధికంగా ఉంటుంది. అందుకే పైనాపిల్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పైనాపిల్ల వంటి పండ్లకు దూరంగా ఉండాలి.
అరటిపండు
డయాబెటిస్ రోగులకు అరటిపండు అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇందులో పంచదార శాతం చాలా ఎక్కువ. మీరు కూడా మధుమేహం వ్యాధిగ్రస్థులైతే అరటి పండ్లకు దూరంగా ఉండండి. లేకపోతే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
Also read: Tulsi Milk Benefits: తులసి పాల గురించి తెలుసా..రోజూ తాగితే ఆ సమస్యలన్నీ మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook