Egg Yolk Protein: ప్రతిరోజూ ఆహరంలో ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు ఇందులో ఉంటాయి. కానీ, ఆ గుడ్డులో ప్రొటీన్లు చాలా తక్కువగా ఉంటే, ఆరోగ్య ప్రయోజనాలను పొందడం సాధ్యం కాదు. కానీ, గుడ్డు రంగును బట్టి అందులో ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయా లేదా ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుడ్డులోని ప్రొటీన్లను పచ్చసొన ద్వారా తెలుసుకోవచ్చు. గుడ్డులోని పచ్చసొన రంగును బట్టి చూస్తే గుడ్డు ఆరోగ్యవంతమైన కోడి నుంచి వచ్చిందా?.. అనారోగ్య కోడికి సంబంధించినదా? అనే విషయం తెలిసిపోతుంది. గుడ్లు ప్రోటీన్‌ లతో పాటు సూపర్ ఫుడ్స్ కాకపోయినా అనేక పోషకాలను అందిస్తాయి.


మార్కెట్‌లో ఒక్కోచోట ఒక్కో ధరకు కోడిగుడ్లు లభిస్తున్నాయి. అలాంటి ధర వ్యత్యాసంతోనూ కోడిగుడ్డు రకాలు ఉంటాయి. గుడ్డు పొదిగినప్పుడు, పచ్చసొన మూడు ప్రధాన రకాలుగా విభజించబడింది. నారింజ, లేత నారింజ లేదా పసుపు కలర్ లో గుడ్డు సొన ఉంటుంది. వీటిలో, నారింజ పచ్చసొనతో కూడిన గుడ్డు చాలా ఆరోగ్యకరమైనది. అందులో ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలను అధికంగా ఉంటాయి.


గుడ్డు పచ్చసొనలో ఎందుకు తేడా ఉంటుంది?


ఇతర కోళ్ల కంటే సహజ వాతావరణంలో పెంచే కోళ్లు ఆరోగ్యకరమని డైటీషియన్లు సూచిస్తున్నారు. ఈ కోళ్లకు తగినంత సూర్యకాంతి, సమతుల్య ఆహారం లభిస్తుంది. ఈ కోడి గుడ్ల పచ్చసొన నారింజ రంగులో ఉంటుంది. ఇది కాకుండా, లేత నారింజ రంగులో ఉన్న గుడ్డు కూడా కొంచెం ఆరోగ్యకరమైనది. అయితే, పచ్చసొనతో ఉన్న గుడ్లు అనారోగ్యం లేదా అనారోగ్య కోళ్లకు సంబంధించిన గుడ్లు కావచ్చు.


కోడిగుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు
1) గుడ్లు ప్రోటీన్ పరంగా రిచ్ ఫుడ్.. ఇది కండరాలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
2) గుడ్డులోని మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బుల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
3) గుడ్లలో కోలిన్ అనే పోషకం కూడా ఉంటుంది. ఈ పోషకం మెదడుకు చాలా మేలు చేస్తుంది.
4) గుడ్లు తినడం వల్ల కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో కళ్లకు మేలు చేసే లుటిన్, జియాక్సంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
5) గుడ్లు తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినే అవకాశాన్ని తగ్గిస్తుంది.   


Also Read: Benefits of Red Banana: ఎర్రటి అరటి పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు!


Also Read: Cashew Nuts Side Effects: ఈ అనారోగ్యాలతో బాధపడేవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook