Benefits of Red Banana: ఎర్రటి అరటి పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు!

Benefits of Red Banana: ఎర్రటి అరటి పండ్లను రోజూ తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ వ్యాధులు, రేచీకటి, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు ఈ అరటి పండ్లను భుజించడం వల్ల నయం అవుతాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:21 PM IST
Benefits of Red Banana: ఎర్రటి అరటి పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు!

Benefits of Red Banana: ఎర్రటి అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి మంచి చేకూరుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అరటి పండ్లను క్రమం తప్పకుండా భుజించడం వల్ల శరీరంలో శక్తి పెరగడం సహా రోగ నిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.  

మన దేశం గురించి చెప్పాలంటే.. ప్రపంచం కంటే ఎక్కువ అరటిపండ్ల ఉత్పత్తి చేస్తుంది. దాదాపుగా 4.5 లక్షల హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు. మన దేశంలో ఏటా 180 లక్షల టన్నుల బరువున్న అరటి పండుతుంది. ప్రపంచంలో దొరికే 300 రకాల అరటిపండ్లలో దాదాపు 30-40 రకాలు భారతదేశంలోనే పండడం విశేషం.

ఎర్రటి అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలు

1) ఎర్రటి అరటి పండ్లలో విటమిన్లు, కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు అనేక ఔషధ గుణాలూ వాటిలో ఉన్నాయి. ఎర్రటి అరటి పండులోని బీటా కెరోటిన్.. కంటి సమస్యలైన క్యాటరాక్ట్ ను నయం చేస్తుంది. 

2) వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రేచీకటితో బాధపడే వారు రాత్రి భోజనం తర్వాత వరుసగా 40 రోజులు ఈ ఎర్రటి అరటి పండ్లను తింటే నయమవుతుంది.

3) ఎర్రటి అరటి పండ్లను భుజిచడం వల్ల చర్మంపై ఏర్పడే దద్దుర్లు, గజ్జి, చర్మపు దద్దుర్లు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 

4) నరాల బలహీనతతో బాధపడే వారు క్రమం తప్పకుండా 48 రోజుల పాటు ఎర్రటి అరటి పండ్లను ఆహరంలో స్వీకరిస్తే మేలు జరుగుతుంది. 

5) శరీరానికి హానీ కలిగించే సూక్ష్మ క్రిముల నుంచి ఎర్రటి అరటి పండ్ల లోని పోషకాలు రక్షణనిస్తాయి. 

6) రోజూ రాత్రి భోజనం తర్వాత ఒక పండు చొప్పున తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అలాగే లివర్ ఇన్ఫ్లమేషన్, యూరినరీ డిజార్డర్స్ ని నియంత్రించే శక్తి ఈ అరటి పండ్లకు ఉంది. 

(Note: పైన పేర్కొన్న సమాచారమంతా వైద్యుల సలహా ప్రకారం నివేదించినవి. సాధారణ అవగాహన కోసం దీని ప్రయోజనాలను వివరించాం. దీనిపై పూర్తి వివరాల కోసం సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు.)  

Also Read: Cashew Nuts Side Effects: ఈ అనారోగ్యాలతో బాధపడేవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది!

Also Read: Weight Loss Breakfast: బెల్లీ ఫాట్ తగ్గించుకునేందుకు తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ మెను!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News