Fenugreek Health Benefits: మెంతులు మన ఇంటి వంటగదిలో అందుబాటులో ఉంటాయి. ఇది వంటకు రుచిని అందించడంమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఖనిజాలు మన ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో నియాసిన్‌, పొటాషియం, ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్ సీ ఐరన్‌ ఉంటుంది. అయితే, ప్రతిరోజూ మెంతులను డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మీ శరీరంలో జరిగే మార్పులు ఏవో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షుగర్‌ కంట్రోల్‌..
మెంతులు షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులో ముఖ్యంగా కరిగే ఫైబర్‌ ఉంటుంది. మెంతుల్లో కార్బొహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు.. మెంతులను డయాబెటీస్‌ వారు డైట్లో చేర్చుకోవడం వల్ల షుగర్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి.


జీర్ణ ఆరోగ్యం..
మెంతులు ప్రతిరోజూ డైట్‌లో చేర్చుకోవడం వ్లల జీర్ణ ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా మలబద్దకం సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యం మెరుగువుతుంది. ఇందులో ముఖ్యంగా జెల్‌ ఉంటుంది.  మంట, వాపు సమస్యను తగ్గిస్తుంది.


ఇదీ చదవండి: ఈ టీ జాయింట్ పెయింట్స్‌ను తగ్గించే ఎఫెక్టీవ్ రెమిడీ.. మ్యాజికల్ బెనిఫిట్స్‌ కలుగుతాయి..


బరువు నిర్వహణ..
మెంతుల్లో మెడిసినల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు కూడా సులభంగా తగ్గిస్తుంది. మెంతుల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయంపాటు కలుగుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. బరువు కూడా పెరగరు. మెంతుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 


గుండె ఆరోగ్యం...
మెంతులు డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల కార్డియో సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తాయి. మెంతుల్లో స్టెరైడల్‌ సపోనన్స్‌ ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించేస్తాయి. మెంతులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.


ఇదీ చదవండి:  ఈ 5 ఆహారాలు మీకు హార్ట్ ఎటాక్ రాకుండా చేస్తాయి.. మీ డైట్ లో తప్పక ఉండాల్సినవి..


హార్మోనల్‌ బ్యాలన్స్..
మెంతుల్లో  డిసోజెనిన్ ఉంటుంది. ఇది హార్మోనల్‌ సమతుల్యం చేస్తుంది. హార్మనల్ బ్యాలన్స్‌ చేసే గుణాలు మెంతుల్లో పుష్కలంగా ఉంటాయి. మెంతులు డైట్లో చేర్చుకోవడం వల్ల హార్మోన్‌ అసమతుల్యత నుంచి బయటపడతారు.


చర్మ ఆరోగ్యం..
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పాలిఫెనల్స్‌ ఉంటాయి. ఆక్సిడేటివ్‌ డ్యామేజ్‌ కాకుండా కాపాడుతుంది. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. యాక్నే, ఎగ్జీమా, సోరియాసిస్‌ రాకుండా నివారిస్తుంది.మెంతుల్లో విటమిన్ ఏ, సీ, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని బలపరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి