Fox Nut For Diabetes: డయాబెటిస్ ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారాలు, జీవన శైలిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించు కోలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు ప్రతి రోజూ తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాల మంచిది. అంతేకాకుండా మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి  పోషకాలు అధికంగా మఖానాను కూడా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మఖానాలో లభించే పోషకాలు ఇవే:
మఖానా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే  విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, ప్రోటీన్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఔషధంగా పని చేస్తుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వీటిని ఆహారంలో తీసుకుంటే సులభంగా అన్ని దూరమవుతాయి.


మధుమేహం ఉన్నవారికి  మఖానా ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?
మఖానాలో తక్కువ గ్లైసెమిక్ సూచికలు ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే సోడియం మధుమేహం ఉన్న వారిని దీర్ఘకాలీక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని రక్షిస్తాయి.


మఖానా ఇలా ఆహారాల్లో తీసుకోండి?
1. నెయ్యి విత్‌ మఖానా:

మఖానాను నెయ్యిలో వేయించి తినాలంటే.. ముందుగా పాన్ తీసుకుని అందులో కొద్దిగా దేశీ నెయ్యి మిక్స్ చేసి తక్కువ మంట మీద వేయించాల్సి ఉంటుంది. నెయ్యిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. కాబట్టి ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ కొవ్వులో ఉండే గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి.


2. గ్లూటెన్ రహిత రోటీ:
మఖానాను  జొన్న, మిల్లెట్ మరియు సోయాబీన్‌లతో మెత్తగా నానబెట్టి రొట్టెల పిండిలా తయారు చేసుకుని రోటీలను చేసుకుంటే  గ్లూటెన్ ఫ్రీ రోటీలను తయారవుతాయి. వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


3. పప్పు, కూరగాయలతో ఇలా..
చాలా మంది మఖానాను పప్పు, కూరగాయలతో కలిపి వండుకుంటారు. అయితే ఇందులో తక్కువగా నూనెను వేసి వండుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ


Also Read : Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook