Health Alert: మనం జీవించాలంటే.. ఆహారం, నీరు అనేది చాలా ముఖ్యం. ప్రతి రోజు సరైన సమయానికి ఆహారం నీళ్లు తీసుకోడవం వల్ల ఆరోగ్యవంతగా జీవించొచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సరైన సమయానికి ఆహారం తీసుకున్నా.. తినే ఆహారం పట్ల కూడా జాగ్రత్త అవసరం. అందుకే బ్రేక్​ ఫాస్ట్​ నుంచి మొదలుకుని రాత్రి భోజనం వరకు ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసకోవాలి అని నిపుణులు అనేక పరిశోధనలతో వివరాలను పొందుపరిచారు. మరి ఆ అధ్యాయనాల ప్రకారం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫైబర్​ అధికంగా ఉండే ఆహార పదార్థాలు..


నిజానికి ఆహారంలో ఫైబర్​ ఉండటం మంచిదే. అలా అని ఫైబర్​ను అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఫైబర్​ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవద్దని సూచిస్తు్న్నారు. ఫైబర్​తో పాటు మిగతా అని పోషకాలు సమపాలలో ఉండే ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.


కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు..


ఖాళీ కడుపుతో కారం అధికంగా ఉండే ఆహారం తీసుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపులో నొప్పి వంటివి కలగొచ్చని చెబుతున్నారు. కొన్ని సార్లు హృదయ సంబంధి సమస్యలు కూడా రావచ్చని వివరిస్తున్నారు.


ఇక ఖాళీ కడుపుతో వేయించిన ఆహారాన్ని కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి గుండెకు మంచివి కావని చెబుతున్నారు.


బెడ్​ కాఫీలు మంచివి కావు..!


చాలా మందికి బెడ్​ కాఫీ అలవాటు ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే ఓ కాఫీ తాగి రోజును ప్రారంభిస్తుంటామని చెబుతుంటారు చాలా మంది. అయితే కడుపులో ఎలాంటి ఆహారం లేకుండా కేవలం కాఫీ తాగటం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆహార నిపుణులు. దీని వల్ల డీ హైడ్రేషన్​ వంటి సమస్యలు తలత్తేతాయని హెచ్చరిస్తున్నారు.


ఉదయం ఇలా చేస్తే మేలు..


ఉదయాన్నే లేచిన తర్వాత నోరు శుభ్రం చేసుకుని గ్లాసు మంచి నీళ్లు (వీలైతే గోరు వెచ్చని నీళ్లు) తాగటం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఫ్రిజ్​ నుంచి తీసిన చల్లటి నీరు మాత్రం తాగొద్దని చెబుతున్నారు. అలా చేస్తే జీర్ణ శక్తి తగ్గిపోతుందని సూచిస్తున్నారు.


మద్యంతో జాగ్రత్త!


మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తరచూ వింటుంటాం. అయితే చలా మంది తరచూ కాకుండా అప్పుడప్పుడు మధ్యం సేవించడం అలవాటుగా పెట్టుకుంటారు. అయితే అలాంటి అలవాట్లు ఉన్న వారైనా.. ఖాళీ కడుపుతో మద్యం తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అలా చేయడ వల్ల నేరుగా కాలెయంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.


Also read: Garlic Tea Benefits: టీలో మరో కొత్త రకం.. వెల్లుల్లి టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?


Also read: Aloe Vera Side Effects: కలబంద రసాన్ని ఎక్కువగా వాడితే కలిగే అనర్థాలు తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook