Aloe Vera Side Effects: కలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అంతే కాకుండా మన అందాన్ని మెరుగుపరుస్తుంది. కలబందను ఔషధాల్లో రారాజు అని కూడా పిలుస్తారు. అయితే దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. దుష్ప్రభావాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలో కలబందకు సంబంధించిన ప్రయోజనాలతో పాటు అప్రయోజనాలను తెలుసుకుందాం.
కలబంద ప్రయోజనాలు
ఈరోజుల్లో ప్రతి ఇంట్లోని పెరట్లో చిన్న మొక్క అయిన ఉంటుంది. ఎందుకంటే దాని ఉపయోగాలను దృష్టిలో ఉంచుకొని.. ఆ మొక్కను పెరట్లో పెంచుకునే విధంగా ప్రేరేపిస్తుంది. కలబంద వినియోగం వల్ల శరీరంలోని పోషకాల కొరతను తీరుతుంది. కలబంద రసంతో రక్తంలోని హెమోగ్లోబిన్ లోపం నివారించవచ్చు.
అంతే కాకుండా పొడి చర్మం, ముడతలు, ముఖంపై మచ్చలు తొలగించడంలో కలబంద సహాయం చేస్తుంది. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద రసం వినియోగం వల్ల కంటి కింద నీటి వలయాలను కూడా నియంత్రించవచ్చు.
కలబంద వినియోగం వల్ల శరీర బరువును కూడా నియంత్రించుకోవచ్చు. అధిక బరువు నుంచి విముక్తి పొందాలంటే కలబంద రసాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే.. వెంటనే బరువు తగ్గే అవకాశం ఉంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.
కలబంద వల్ల కలిగే దుష్ప్రభావాలు
అలోవేరా వల్ల అనేక ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కలబందను ఎక్కువగా తీసుకోవడం శరీరానికి హానికరం. దీని రసాన్ని ఎక్కువగా వినియోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, ఎర్రని బెందులు వస్తాయి. కలబంద రసాన్ని అతిగా తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. దీంతో రక్తపోటు దారుణంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
Also Read: Egg Side Effects: ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏంటో తెలుసా?
Also Read: Betel Leaf Benefits: శోభనం గదిలో పురుషులు తమలపాకులు (పాన్) ఎందుకు తింటారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Aloe Vera Side Effects: కలబంద రసాన్ని ఎక్కువగా వాడితే కలిగే అనర్థాలు తెలుసా?