Pasta Benefits : పాస్తా వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
ఫాస్ట్ ఫుడ్ తినే వారికి పాస్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వారి కిచెన్ లో పొద్దున్నే పులిహోరా, ఇడ్లీ, దోశా, వడ, పూరి ఇలా రకరకాల ఐటెమ్స్ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ సాధారణమే. ఇందులో మ్యాగీ ( Maggie) కూడా చేరింది.
ఫాస్ట్ ఫుడ్ తినే వారికి పాస్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు వారి కిచెన్ లో పొద్దున్నే పులిహోరా, ఇడ్లీ, దోశా, వడ, పూరి ఇలా రకరకాల ఐటెమ్స్ బ్రేక్ ఫాస్ట్ మెన్యూ సాధారణమే. ఇందులో మ్యాగీ ( Maggie) కూడా చేరింది. ఇటీవల కాలంలో పాస్తా కూడా ఈ మెన్యూలోకి వచ్చేసింది. సింపుల్ గా ఉడకబెట్టి మసాలా, ఇతర దినుసులు వేసి మొత్తం 10 నిమిషాల్లో టేస్టీ పాస్తాను తయారు చేస్తున్నారు.
ALSO READ| Health Tips: నీళ్లు తాగే సరైన విధానం ఇదే!
పాస్తా వల్ల ఆరోగ్యానికి (Health) అనేక లాభాలు..
పెద్దలూ, పిల్లలూ అని తేడాలేవీ లేకుండా అందరికీ పాస్తా (Pasta) ఒక బెటర్ డైట్ అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
పాస్తా తినడం వల్ల పోషకాలు తగిన మోతాదులో శరీరానికి అందుతాయి.
బరువు పెరగడం, లేదా తగ్గడంలో ఉపయోగడుతుంది.
ఫ్రంటైర్స్ ఇనిస్టిట్యూట్ జర్నల్ ప్రచురణ ప్రకారం పాస్తా తినే మహిళల నడము వద్ద కొవ్వు కూడా తగ్గిందట.
దాంతో పాటు శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ లో కూడా ఛేంజ్ కనిపించిందట.
ALSO READ| Health Tips : ఈ సమస్యలు ఉన్న వాళ్లు పసుపు పాలు తాగడం మంచిది కాదు
ఫ్రంటైర్స్ ఇనిస్టిట్యూట్ చేపట్టిన స్డడీలో 2 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు పాల్గొన్నారు. వీరికి తరచూ పాస్తాను అందించగా వారికి పోషకాలు సరిగ్గా అందినట్టు తేలింది. దాంతో పాస్తా ఫాస్ట్ ఫుడ్ అవడంతో పాటు పోషకాలు అధికంగా ఉన్న ఫుడ్ అని చెబుతున్నారు పరిశోధకులు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR