Health Benefits Of Pranayama: ‘శ్వాస మీద ధ్యాస’ మీ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. అందుకు ప్రాణాయామం ఓ మార్గం అని వైద్యులు, మానసికతత్వ వేత్తలు సూచిస్తుంటారు. ఆధునిక కాలంలో నిత్యం భరించలేని ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, మీ గుండెపై భారం తగ్గించాలన్నా ప్రాణామయం చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన దేశం భారతదేశం కనుక ఇలాంటి ప్రాచీన విద్య మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రాణాయామం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits Of Pranayama)
- అధిక రక్తపోటు(High BP) సమస్యతో బాధపడేవారు ప్రాణాయామం చేయడం మంచిది. ప్రాణాయామం చేయడం వల్ల రక్తపోటు(Blood Pressure) సమస్య తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.


- Health Tips రక్తపోటు నియంత్రణలో ఉండటం వల్ల గుండెపోటు, గుండె జబ్బులు, ఇరత్రా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ప్రాణాయామం కొంతమేర నియంత్రిస్తుంది.


- ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఏర్పడే అధిక ఒత్తడికి ప్రామాయామం పరిష్కారం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు.


Also Read: Cloves Benefits: లవంగాలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?


- ప్రతిరోజూ ప్రాణాయామం చేయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. తద్వారా శరీరంలోని పలు అవయవాలు ఏ ఇబ్బంది లేకుండా, మునుపటి కన్నా చురుకుగా పనిచేస్తాయి.


- ప్రాణాయామం సుదీర్ఘంగా నెలల తరబడి చేస్తున్న వారికి ఒంట్లోని చెడు కొవ్వును తగ్గిస్తుంది. అధిక శారీరక శ్రమ చేయకుండా బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఇది చక్కటి పరిష్కార మార్గం.


- ప్రాణాయామం క్రమం తప్పకుండా చేసేవారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. వీరిలో ఏకాగ్రత సైతం పెరుగుతుందని పలు అధ్యయనాలలో తేలింది.


Also Read: Sleeping At Afternoon: మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రించవచ్చా.. ఈ లాభాలు తెలుసుకోండి 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook