Cholesterol Symptoms: గోర్ల రంగు మారిందా, చేతులు నొప్పెడుతున్నాయా...అయితే ఆ సమస్య కావచ్చు
Cholesterol Symptoms: ఆధునిక జీవనశైలి కారణంగానే సగం వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇందులో ప్రధానమైంది కొలెస్ట్రాల్. ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ బాడీలో ఉందో లేదో ఎలా గుర్తించాలి
రోజంతా ఒత్తిడి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో ముఖ్యమైంది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఒక్కటుంటే చాలా సమస్యలు చాలా వెంటాడుతాయి. అయితే శరీరంపై కన్పించే కొన్ని లక్షణాలతో కొలెస్ట్రాల్ ఉందో లేదో గుర్తించవచ్చు.
ఇటీవలి కాలంలో అందరి జీవనశైలి పాడవుతోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు బలవుతున్నారు. చెడు లైఫ్‌స్టైల్ కారణంగా కొలెస్ట్రాల్, గుండెపోటు ముప్పు పెరుగుతోంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్థూలకాయంతో పాటు అధిక రక్తపోటు సమస్య కూడా వేధిస్తుంటుంది. చాలామందికి శరీరంలో కొలెస్ట్రాల్ ఉందో లేదో త్వరగా తెలుసుకోకపోవడం వల్ల పరిస్థితి విషమిస్తుంటుంది. అయితే శరీరంపై బాహ్యంగా కన్పించే కొన్ని లక్షణాలతో కొలెస్ట్రాల్‌ను సులభంగానే గుర్తించవచ్చు.
కొలెస్ట్రాల్ ఉంటే గోర్లు, చేతుల్లో కన్పించే లక్షణాలు
గోర్లు పసుపుగా మారడం
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గోర్ల రంగు పసుపుగా మారుతుంది. శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తుంది. ఫలితంగా గోర్ల రంగు మారుతుంది. పసుపు రంగులో కన్పిస్తాయి. లేదా గోర్లు బీటలువారుతాయి. గోర్ల పెరుగుదల కూడా నిలిచిపోతుంది.
చేతుల్లో నొప్పి
శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే కొద్దీ..చేతుల్లోని రక్త నాళికలను క్లోజ్ చేస్తుంది. ఫలితంగా చేతులు నొప్పి వస్తుంటాయి. అందుకే తరచూ చేతుల నొప్పి సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.
చేతులు తిమ్మిరెక్కడం
శరీరంలోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడటంతో చేతులు తిమ్మిరెక్కుతుంటాయి. స్థూలకాయం, హై కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా చేతులు తిమ్మిరెక్కుతుంటాయి.
Also read: Health Tips: రోజూ డ్రైఫ్రూట్స్ ఎలా తినాలి, ఎలా తింటే అధిక ప్రయోజనాలు కలుగుతాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook