Immunity Foods: వర్షాకాలంలో ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది, ఏయే పదార్ధాలు తినాలి
Immunity Foods: వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకునేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సిందే. డైట్‌లో చేసుకోవల్సిన మార్పుల గురించి తెలుసుకుందాం..
Immunity Foods: వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకునేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సిందే. డైట్‌లో చేసుకోవల్సిన మార్పుల గురించి తెలుసుకుందాం..
వర్షాకాలంలో సహజంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే వర్షాకాలం వస్తే చాలు అనారోగ్యం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్దు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలపై ఎక్కువగా ఫోకస్ ఉంచాలి. కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు అందడంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్ధాలేంటో తెలుసుకుందాం..
పప్పు దినుసులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. పప్పు దినుసులు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు శరీరంలో యాంటీబాడీస్ పెరుగుతాయి. అయితే పప్పు ఎప్పుడూ తాజాగానే తినాల్సి ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన పదార్ధం. పసుపు కలిపిన పాలు తాగడం. నిజానికి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దీనిని మించిన ఔషధం లేదనే చెప్పాలి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ రెండూ కలపడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇక అందరికీ తెలిసింది డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య పోతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా పలు వ్యాధుల్నించి సంరక్షించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook