Benefits Yellow Foods For Heart: దేశంలో హృద్రోగుల సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. మారిన జీవన శైలి, మనం తీసుకునే ఆహారమే ఈ గుండెజబ్బులకు (Heart Attack) కారణం కావచ్చు. జంక్ పుడ్, అయిల్ పుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. మీరు సరైన ఆహారం తీసుకోకపోతే గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ మరియు ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ కింది ఎల్లో పుడ్ తీసుకోవడం ద్వారా మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. మామిడి (Mango)
వేసవి కాలంలో మామిడి పళ్లు ఎక్కువగా దొరుకుతాయి. దీనిలో పైబర్, పోటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతోపాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 
2. నిమ్మకాయ (Lemon)
నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి అద్భుతంగా పనిచేస్తుంది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే బరువును తగ్గించడంలో లెమన్ ఉపయోగపడుతుంది.  
3. అరటి (Banana)
గుండె జబ్బులు ఉన్నవారు రోజూ అరటి పండ్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అరటిపండ్లను పరిమిత పరిమాణంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. 
4. పైనాపిల్ (Pinepple)
ఈ పండు ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది. ఫైనాపిల్ లో పొటాషియం, సోడియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులకు రాకుండా చేస్తాయి. 
5. బెల్ పెప్పర్ (Bell Pepper)
ఇందులో పుష్కలంగా ఫైబర్, ఐరన్ మరియు ఫోలేట్ ఉంటాయి. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అదేవిధంగా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  


Also Read: Cherry Fruit Benefits: చెర్రీ పండ్లు రోజూ తింటే..ఆరోగ్యంతో పాటు స్థూలకాయ సమస్యకు చెక్ 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook