Cherry Fruit Benefits: ఆరోగ్యానికి సంబంధించిన చాలా సమస్యలకు పరిష్కారం చెర్రీ పండ్లు. అదే సమయంలో చెర్రీ పండ్లతో బరువు కూడా తగ్గవచ్చని ఎంతమందికి తెలుసు. ఆ వివరాలు మీ కోసం..
చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి సంబంధించిన చాలా సమస్యలు దూరమౌతాయి. అంతేకాదు..బరువు కూడా తగ్గవచ్చని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. చాలా రకాల అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. చెర్రీ పండ్లలో ఉండే పోషకాలతో కొవ్వు వేగంగా కరుగుతుంది. చెర్రీ పండ్లతో కలిగే ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చెర్రీ పండ్లతో ప్రయోజనాలు
మీరు స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే చెర్రీ పండ్లు అద్భుత పరిష్కారాన్నిస్తాయి. చెర్రీ పండ్లలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ బరువును తగ్గించడంలో దోహదపడుతాయి. విటమిన్ సి , నీరు పుష్కంలగా ఉండటంతో డైట్ కంట్రోల్‌కు అద్భుత ఔషధంగా ఉంది. రోజూ మీ డైట్‌లో చెర్రీ పండ్లను భాగంగా చేసుకుంటే..బరువు వేగంగా తగ్గుతారు.
చెర్రీపండ్లను ఆహారంతో పాటు తీసుకుంటే కొవ్వును వేగంగా కరిగించడంలో దోహదపడుతుంది. చెర్రీ పండ్లు తినడం వల్ల మెలటోనిన్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. చెర్రీలో ఉండే మెగ్నీషియం వల్ల అధికంగా ఉన్న సోడియంను తగ్గిస్తుంది. శరీరంలో పొటాషియం, సోడియం బ్యాలెన్స్ చేయడంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
చెర్రీ పండ్లలో ఉండే ఏంథోసయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అటు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. చెర్రీ పండ్లు క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే..ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా మారుతుంది.
Also read: Skin Care Tips: రాత్రి పూట పొరపాటున కూడా ఆ పొరపాట్లు చేయవద్దు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook