Health Precautions: మధుమేహం సాధారణంగా కన్పించే అత్యంత ప్రమాదకర వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా బాధిస్తున్న వ్యాధి. ఈ నేపధ్యంలో డయాబెటిస్ సోకినవారు తీసుకోవల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు లేదా సూచనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన రేపుతోంది. అటు ప్రపంచంలో కూడా డయాబెటిస్ కేసులు భారీగానే పెరుగుతున్నాయి. బిజీ లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, పోటీ ప్రపంచం కారణంగా వివిధ అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నా..ప్రధానంగా వెంటాడుతున్న సమస్య డయాబెటిస్. చాలా సాధారణమైపోయింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకమౌతుంది. అందుకే డయాబెటిస్ సోకినవారు ఈ ఐదు సూచనలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


1. మీకు డయాబెటిస్ ఉంటే..ముందుగా మీ శరీరాన్ని ఓ దీర్ఘకాలిక యుద్ధం చేసేందుకు సన్నద్ధం చేయాలి. ఎందుకంటే డయాబెటిస్ సోకినప్పుడు ఒకరోజు యుద్ధం సరిపోదు. మీ మనసును..శరీరాన్ని లాంగ్ బ్యాటిల్ కోసం సన్నద్ధం చేయాలి. యోగా, ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ ఇందుకు దోహదపడతాయి. స్పోర్ట్స్ అలవాటు చేసుకున్నా మంచి ఫలితాలుంటాయి.


2.  మీ బాడీ మాస్ ఇండెక్స్ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీ శరీర బరువుపై దృష్టి సారిస్తుండాలి. బరువు ఎప్పుడూ అవసరమైనంత ఉండాలి. మీ పొడుగు, వయస్సుకు తగ్గట్టు బరువుంటే ఆరోగ్యానికి మంచిది.


3. డయాబెటిస్ రోగులు ముఖ్యంగా నేచురల్, ప్రోసెస్డ్ షుగర్ మధ్య తేడాను అర్ధం చేసుకోవాలి. జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్, ఆల్కహాల్, స్వీట్స్ అనేవి డయాబెటిస్ రోగి పరిస్థితిని దిగజార్చుతాయి. అందుకే ప్రోసెస్డ్ షుగర్ పూర్తిగా దూరం చేయాలి. ఇదంతా ప్రతిరోజూ జరగాల్సిందే.


4. డయాబెటిస్ టెస్ట్ ఫలితాల రికార్డ్ మెయింటైన్ చేస్తూ..ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదిస్తుండాలి. ఓ సరైన వైద్యుడితో కాంటాక్ట్‌లో ఉండటం ద్వారా ఇతరత్రా సమస్యలు వచ్చినప్పుడు చికిత్సకు ఉపయోగపడుతుంది. గ్లూకోమీటర్, బీపీ మీటర్ ఇంట్లో సిద్ధంగా ఉంచుకోవాలి.


5. ఇక చివరిగా పాటించాల్సింది అతి ముఖ్యమైంది రోజూ తీసుకునే ఆహారం. నేచురల్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. మీ బాడీ శక్తి అందిపుచ్చుకునేందుకు, ఎనర్జెటిక్ అయ్యేందుకు తగిన సమయం కేటాయించాలి. జీర్ణక్రియ సులభమయ్యే ఆహార పదార్ధాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.


Also read: Metabolism: మెటబోలిజం అంటే ఏంటి, ప్రాముఖ్యతేంటి, ఎలా మెరుగుపర్చుకోవడం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి