Green Chiretta or Nelavamu Mokka Benefits: అందుకే భారతదేశంలో ఆయర్వేదశాస్త్రం అనాదిగా ప్రాచుర్యంలో ఉంది. ఆయుర్వేద మూలికలతో చాలా రకాల వ్యాధుల్ని దూరం చేసే చికిత్సా విధానముంది. అటువంటిదే ఈ మొక్క. నేలవేము మొక్కగా పిల్చుకునే ఈ మొక్కతో ఏకంగా 5 వ్యాధులను నయం చేయవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేలవేము ఒక రకమైన ఔషధ మొక్క. ఇంట్లో కుండీలలో కూడా పెంచుకోగలిగే ఈ మొక్క వేప కంటే చేదుగా ఉంటుంది. ఈ మొక్క కాండంలోను, ఆకులోను ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంగ్లీషులో గ్రీన్ చిరెట్టా అని పిలుస్తారు. ఈ మొక్క సహాయంతో చాలా రకాల వ్యాధులు పరిష్కారమౌతాయి. కాలమేఘ్ మొక్క అని హిందీలో పిలుస్తుటారు. ఈ మొక్కతో కలిగే ఇతర ఆరోగ్యకర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


కేన్సర్


కేన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి. ప్రారంభదశలో గుర్తించలేకపోతే ప్రాణాలు పోతుంటాయి. నేలవాము మొక్క ఆకులు లేదా కాండం రోజూ క్రమం తప్పకుండా నీళ్లలో కాచి తీసుకోవడం లేదా పేస్ట్ చేసి గుళికల్లా తీసుకుంటే కేన్సర్ ముప్పు సైతం తగ్గుతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.


Also Read: Magnesium Deficiency: కండరాల తిమ్మిర్లతో సతమతమవుతున్నారా? ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఇదే!


బాడీ పెయిన్స్


తరచూ బాడీ పెయిన్స్ రావడం సహజమే. ఒక్కోసారి భరించలేనంతగా బాడీ పెయిన్స్ బాధిస్తుంటాయి. విశ్రాంతి తీసుకున్నా సరే ఫలితముండదు. ఈ పరిస్థితుల్లో నేలవాము మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఎనాల్జెసిక్ గుణాలు స్వెల్లింగ్, నొప్పులతో పాటు ఐరన్ లోపాన్ని దూరం చేస్తాయి.


ఇన్‌ఫెక్షన్


నేలవాము మొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా వివిధ రకాల అంటువ్యాధుల్నించి రక్షణ పొందవచ్చు. జ్వరం, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గొంతు ఇన్‌ఫెక్షన్ దూరం చేసేందుకు ఈ మొక్క చాలా బాగా పనిచేస్తుంది. 


లివర్ వ్యాధులు


లివర్ అనేది మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం. శరీరంలో వివిధ రకాల పనులు చేస్తుంటుంది. అందుకే లివర్ ఆరోగ్యం చాలా అవసరం. రోజూ నిర్ణీత మోతాదులో నేలవాము మొక్కను సేవిస్తుంటే లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.


అజీర్తి


ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కారణంగా జీర్ణక్రియ చాలామందికి పాడైపోతుంటుంది. తీసుకున్న ఆహారం జీర్ణమవడంలో సమస్యగా ఉంటుంది. గ్యాస్ సమస్య రావచ్చు. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు నేలవాము మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది.


Also Read: Unhealthy Gut Signs: మీ కడుపులో పురుగులున్నాయా లేవా, ఈ లక్షణాలతో తెలిసిపోతుంది



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి