Health Benefits: శాకాహార వంటల్లో బంగాళదుంప లేకుండా ఉండదు. బంగాళదుంప కూర తప్పకుండా మెనూలో ఉండాల్సిందే. దేశమంతా ఆలూ విస్తృతంగా వినియోగిస్తారు. ఉత్తరాదిలోనే బంగాళదుంప వినియోగం ఎక్కువగా ఉన్నా దక్షిణాదిన సైతం ఉపయోగిస్తుంటారు. కేవలం రుచి కోసమే కాదు..ఆరోగ్యపరంగా కూడా బంగాళదుంపతో చాలా ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా బంగాళదుంపను కూరగాయలకు రారాజుగా పిలుస్తారు. ఎందుకంటే భారతీయ వంటల్లో బంగాళదుంపకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ మధ్య కాలంలో అయితే అంటే ఆధునిక జీవన శైలిలో ప్యాకెట్ ఫుడ్స్‌లో కూడా బంగాళదుంపకు ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇది ఆరోగ్యానికి మంచిది కాకపోయినా దుంప వినియోగం మాత్రం అధికంగా ఉందని చెప్పాల్సి వస్తోంది. బంగాళదుంపను చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఉత్తరాదిన ఆలూ పరాఠా, ఆలూ శాండ్విచ్ వినియోగం చాలా ఎక్కువ.


బంగాళదుంపను ఇతర ఏ కూరల్లో కలిపి తీసుకున్నా లేదా చికెన్, మటన్‌తో కలిపి వండినా చాలా లాభదాయకం. బంగాళదుంపను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది చెబుతారు. కానీ బంగాళదుంపను సరైన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి ప్రయోజనమే. 


బంగాళదుంపను డైట్‌లో భాగం చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా పెద్దమొత్తంలో ఉంటుంది. బంగాళదుంపను రోజూ తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. ఎవరికైనా మలబద్ధకం లేదా ఇతర సమస్యలుంటే బంగాళదుంపతో ఆ సమస్యను దూరం చేయవచ్చంటున్నారు వైద్యులు. బంగాళదుంపలో తగిన మోతాదులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. శరీరంలో ఎనర్జీని పెంచుతాయి.


బంగాళదుంపను డైట్‌లో చేర్చుకుంటే చర్మానికి నిగారింపు వచ్చి చేరుతుంది. బంగాళదుంపలో ఉండే విటమిన్ బి6 కారణంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఉడకబెట్టిన బంగాళదుంపను తినడం వల్ల చర్మానికి కొత్త నిగారింపు వస్తుంది. బంగాళదుంప రసంతో స్కిన్ ట్యానింగ్, డార్క్ స్పాట్స్ సమస్య తొలగిపోతుంది. బంగాళదుంప ఏజీయింగ్ సమస్యను పోగొడుతుంది. వారానికి 3-4 సార్లు బంగాళదుంప రసాన్ని రాయడం వల్ల ముఖంపై ఫైన్ లైన్స్, ముడతలు, పింపుల్స్ తగ్గిపోతాయి.


బంగాళదుంపతో గుండెకు ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా నియంత్రితమౌతుంది. బంగాళదుంపను సరైన పద్దతిలో తీసుకుంటే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గిపోతుంది. బంగాళదుంపలో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.


Also read: Custard Apple Leaves: సీతాఫలమే కాదు వాటి ఆకులు కూడా శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయాట!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook