Benefits Of Custard Apple Leaves: సీతాఫలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి సీజన్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-బి, ఐరన్, కాల్షియం అందుతాయి. అయితే శరీరానికి సీతాఫలాలే కాకుండా వాటి ఆకులు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటి ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
సీతాఫలం ఆకులతో శరీరానికి కలిగే లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపడడానికి..
సీతాఫలం ఆకుల్లో ఫైబర్‌తో పాటు ఇతర ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా నమిలి తినడం వల్ల జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో టానిన్ అనే ఎంజైమ్ కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని తినడం వల్ల లూజ్ మోషన్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
మధుమేహాన్ని సులభంగా నియంత్రిస్తుంది:
సీతాఫలం ఆకుల్లో ఉండే ఫైబర్ పరిమాణాలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మొటిమలు తొలగిపోతాయి:
మొటిమలను తొలగించేందుకు కూడా సీతాఫలం ఆకుల ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి అన్ని చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ ఆకుల్లో లభించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు వ్యాప్తి అరికడతాయి.
గుండెను ఆరోగ్యం కోసం:
సీతాఫలం ఆకుల్లో పొటాషియం, మెగ్నీషియం కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి వీటిని నమిలి తినడం వల్ల గుండె కండరాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయి టాక్సిన్స్‌ను కూడా సులభంగా తొలగిస్తాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..