Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ పదార్ధాలు డైట్‌లో చేర్చండి
Fatty Liver Tips: ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. జీవన విధానం సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటోంది.
Fatty Liver Tips: ఇటీవలి కాలంలో ఎదురౌతున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ప్రధానమైంది ఫ్యాటీ లివర్. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సమస్యాత్మకం కావచ్చు. ఈ సమస్యకు ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లే.
ఆధునిక పోటీ ప్రపంచంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, మాంసాహారం, మద్యపానం వంటి అలవాట్ల కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఫ్యాటీ లివర్ సమస్యను హెల్తీ ఫుడ్స్ ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు. ముఖ్యంగా రోజూవారీ డైట్‌లో విటమిన్ ఎ, సి, కేతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అదికంగా ఉండే పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ వంటివి చేర్చడం వల్ల లివర్ ఆరోగ్యంగా మారుతుంది. లివర్ సెల్స్ పునరుత్పత్తికి దోహదమౌతుంది. వీటిలో ఉండే ఫైబర్ కారణంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.
ఫ్యాటీ లివర్, లివర్ బర్న్ సమస్యల్ని తగ్గించేందుకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్, మ్యాక్రెల్, సార్డినెస్ వంటి చేపల్ని తినాల్సి ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ కాలేయంలో పేరుకుపోకుండా నియంత్రిస్తుంది. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, గోధుమలు డైట్‌లో ఉండే ఫ్యాటీ లివర్ సమస్య రాకపోవచ్చు. ఎందుకంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అదే సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల లివర్ సమస్య తలెత్తదు.
ఇక పండ్ల విషయానికొస్తే బెర్రీలు, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ , రాస్ బెర్రీస్ డైట్‌లో చేర్చడం వల్ల శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో లబిస్తాయి. లివర్ సంబంధిత వ్యాధులు ఉత్పన్నం కావు. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో వాల్‌నట్స్, బాదం తింటే చాలా మంచిది. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఫలితంగా లివర్ ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం.
Also read: Bad Habits For Brain: ఈ ఐదు చెడు అలవాట్లు మీలో ఉన్నాయా..? మీ మెదడును టెస్ట్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook