Heart Failure Risk: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ కేసులు అధికమయ్యాయి. ముఖ్యంగా కొందరిలో ప్రత్యేకించి ఈ ప్రమాదం ఎక్కువగా కన్పిస్తోందని తెలుస్తోంది. అసలు గుండెపోటు ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్రలేమి, స్థూలకాయం ఇలా వివిధ కారణాలతో హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సుకే గుండె పోటుకు గురవుతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ పరిస్థితుల్లో మానసిక పరిస్థితి కూడా క్షీణిస్తుంది. గుండె విఫలమైనప్పుడు తగిన పరిమాణంలో రక్తం ఊపిరితిత్తులు, శరీరంలోని ఇతర అవయవాలకు చేరదు. గుండెకు హాని కలిగినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురౌతుంది. కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం, హార్ట్ స్వెల్లింగ్, బీపీ వంటివి గుండె వైఫల్యానికి కారణమౌతుంటాయి.


గుండె కండరాల్లో ఎక్కువ భాగం డ్యామేజ్ అయినప్పుడు యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ, మందులతో కూడా నయం చేయలేని పరిస్థితి ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది కలగడం, కాళ్లు, కడుపు వాపు ఉండటం, తుంటి, కాలి కండరాల్లో నొప్పి, తిమ్మిరి ఉండటం ప్రధానంగా గమనించవచ్చు. అంతేకాకుండా చిన్నదానికే అలసట ఎక్కువగా ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారిలో, ధూమపానం, మద్యపానం అలవాట్లుండేవారిలో గుండె పోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా కొలెస్ట్రాల్, బీపీ వ్యాధిగ్రస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాబోలిక్ స్టెరాయిడ్స్, కేన్సర్ మందులు కూడా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. 


గుండె పోటు ముప్పును ఎలక్ట్రో కార్డియోగ్రామ్, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఛెస్ట్ ఎక్స్ రే, ఎకో కార్డియోగ్రామ్, కార్డియాక్ యాంజియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా నిర్ధారించవచ్చు.


Also read: Beer Health Benefits: మందుబాబులకు గుడ్ న్యూస్.. బీరు తాగితే ఈ రోగాలు పరార్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook