Drinks to Reduce Cholesterol: కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకం కాగలదు. ఇతర ప్రమాదకర వ్యాధులైన మధుమేహం, హార్ట్ ఎటాక్ వంటివాటికి దారి తీస్తుంది. అయితే కొన్ని హెల్తీ డ్రింక్స్ ద్వారా డయాబెటిస్ , హార్ట్ ఎటాక్ నుంచి రక్షించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం చెడు ఆహారపు అలవాటే. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడటం వల్ల రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. ఆ తరువాత అధిక రక్తపోటు, గుండె వ్యాధులకు కారణమౌతోంది. ఫలితంగా డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ను సమూలంగా నిర్మూలించవచ్చు.


గ్రీన్ టీ


గ్రీన్ టీ అనేది సర్వామోదమైన హెల్తీ డ్రింక్. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ప్రతిరోజూ నిర్ణీత మోతాదులో నిర్ణీత సమయంలో సేవించడం వల్ల చాలా వ్యాధులు దూరమౌతాయి. ఇందులో ఉండే కైటోచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా బరువు తగ్గించుకునేందుకు కూడా దోహదపడుతుంది. అయితే రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. 


Also Read: Knee Joint Pain: ఈ డైట్‌తో మోకాళ్ల, కీళ్ల నొప్పులు కేవలం 15 రోజుల్లో తగ్గడం ఖాయం!  


దానిమ్మ జ్యూస్


దానిమ్మ నిజంగానే అద్భుతమైన పోషకాహారం అని చెప్పవచ్చు. చాలా వ్యాధులకు ఇదొక మంచి పరిష్కారం. ఇందులో ఉండే వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ను పూర్తిగా దూరం చేస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు చాలావరకూ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా గుండె వ్యాధులు దూరమౌతాయి.


హైబిస్కస్ టీ


మందారం పూలు అందంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. చాలా అధ్యయనాల్లో ప్రచురించిన పరిశోధనల ప్రకారం మందారం పూలతో టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గుతుంది. డయాబెటిస్ ముప్పు కూడా తగ్గుతుంది.


సోయా మిల్క్


సోయా వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది. శాకాహారులు ప్రోటీన్ అవసరాల్ని తీర్చుకోవాలంటే సోయా మిల్క్ అద్భుతంగా పనిచేస్తుంది. సోయా మిల్క్ అనేది చెడు కొలెస్ట్రాల్ నిర్మూలనలో ఉపయోగపడుతుంది. రక్త నాళాల్లో పేరుకున్న కొవ్వు కూడా దూరమౌతుంది.


Also Read: Health Tips: రోజూ ఇవి నానబెట్టి తింటే..మధుమేహమైనా, కొలెస్ట్రాల్ అయినా దూరం కావల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook