Foods to Reduce Joint Pain: వీటితో 15 రోజుల్లో ఎంతటి కీళ్ల నొప్పులైన మటుమాయం!

Foods to Reduce Knee Joint Pain: ప్రతి రోజు బెర్రీలు, బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్‌ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని ఎలా తీసుకోవడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 4, 2023, 12:48 PM IST
Foods to Reduce Joint Pain: వీటితో 15 రోజుల్లో ఎంతటి కీళ్ల నొప్పులైన మటుమాయం!

Joint Pain Reducing Foods: ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు.  ప్రస్తుతం చాలా మందిలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మందిలో నడవడం కూడా పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు పలు ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

విత్తనాలు, గింజలు:
కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్‌నట్స్‌ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ E కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

బెర్రీలు:
బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

కూరగాయలు:
సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్‌ యాసిడ్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.   

ఆలివ్ ఆయిల్:
కీళ్ల నొప్పులున్నవారు తప్పకుండా ఆహారం వండే క్రమంలో ఆలివ్‌ ఆయిల్‌ మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ నూనెను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. అంతేకాకుండా సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

డార్క్ చాక్లెట్: 
డార్క్ చాక్లెట్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. 

Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News