Papaya Side Effects: బి అలర్ట్.. బొప్పాయి తింటే ఎన్ని సమస్యలో తెలుసా..?
Papaya Side Effects: పండ్లు ఆరోగ్యానికి మంచివి. ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ఇందులో ముఖ్యమైంది బొప్పా.యి. అద్భుతమైన పోషకాలు కలిగిన బొప్పాయి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే కొంతమందికి మాత్రం బొప్పాయి తినడం హాని చేకూరుస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Papaya Side Effects: బొప్పాయి ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. బరువు తగ్గించేందుకు చాలామంది బొప్పాయిని డైట్‌లో భాగంగా చేసుకుంటారు. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు శరీర నిర్మాణంలో ఉపయోగపడతాయి. ఇన్ని పోషక విలువలున్న బొప్పాయి ఎవరికి మంచిది కాదు..
వైద్య నిపుణుల ప్రకారం ఇంత పెద్దమొత్తంలో పోషక విలువలు ఉన్నా కొంతమందికి ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. వాస్తవానికి రోగ నిరోధక శక్తి పెంచేందుకు, జీర్ణ వ్యవస్థకు, గుండె ఆరోగ్యానికి బొప్పాయి చాలా ప్రయోజనకరం. కానీ కొంతమంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బొప్పాయి తినకూడదు.
బొప్పాయిలో విటమిన్ సి పెద్దమొత్తంలో ఉంటుంది. బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కాల్షియం ఆక్సిలేట్ పరిస్థితి ఉత్పన్నమౌతుంది. ఇది కిడ్నీలో రాళ్ల పరిమాణాన్ని పెంచుతుంది. అందుకే కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు బొప్పాయికి దూరంగా ఉంటే మంచిది.
ప్రెగ్నెన్సీ మహిళలు బొప్పాయి తినడం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే లేటెక్స్ గర్భాశయాన్ని సంకోచించేలా చేస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా బొప్పాయి తినకూడదు.
మధుమేహం వ్యాధిగ్రస్థులకు బొప్పాయి చాలా మంచిది. కానీ లో షుగర్ అంటే హైపోగ్లైసీమియా రోగులు బొప్పాయి తినకూడదు. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్లు బొప్పాయికి దూరంగా ఉండాలి.
బొప్పాయి పండ్లను కొన్ని రకాల మందులతో కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే బొప్పాయి గుణం రక్తాన్ని పల్చగా చేస్తుంది. దాంతో శరీరంలో బ్లీడింగ్ సమస్య ఉత్పన్నం కావచ్చు. అంటే బ్లడ్ ధిన్నర్ మందులు వేసుకునేవాళ్లు బొప్పాయికి దూరంగా ఉండాలి.
Also Read: Menstrual Cycle: మెన్స్టువల్ సైకిల్ అంటే ఏంటి, ఎలాంటి సమస్యలు, లక్షణాలుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి