5 Reasons for Heart Attack: గతంతో పోల్చితే ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బులలో గుండెపోటు ఒకటి. ఈ రోజుల్లో గుండెపోటు రావడం సర్వసాధారణం అయిపోయింది. దశాబ్దం కిందటి వరకు వృద్ధులకు, ఉబకాయంతో బాధపడుతున్న వారిలోనే అధికంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ హెల్త్ టిప్స్ (Health Tips) పాటించకపోవడంతో ఇప్పుడు యువకులు సైతం గుండెజబ్బులతో చనిపోతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తికి పలు కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. అందులో కొన్ని ముఖ్యమైన కారణాలు మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ధూమపానం మరియు పొగాకు ఉత్పతులతో గుండెపోటు వస్తుంది. ధూమపానం మరియు పొగాకు వినియోగం గుండెపోటు (Healrt Attack) ప్రమాదాన్ని మరింతగా పెంచుతుంది. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు ఉత్పత్తులు తినవద్దు అని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Health Tips: నారింజ పండు తొక్కే కదా అని పారేయవద్దు.. ఈ లాభాలు తెలుసా!



అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. మీకు అధిక రక్తపోటు (High Blood Pressure) సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అధిక రక్తపోటు గుండెను నియంత్రించే ధమనులను దెబ్బతీస్తుంది. అధిక కొవ్వు, స్థూలకాయం మరియు డయాబెటిస్ లేక షుగర్ (Diabetes) వ్యాది కారణంగా తరచుగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. తద్వారా గుండెపోటు వస్తుంది.


Also Read: Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు


ఉబకాయం గుండెపోటుకు దారితీస్తుంది. స్థూలకాయం కారణంగా అధిక రక్తపోటు (High Blood Pressure) మరియు డయాబెటిస్ (Diabetes) సమస్యల బారిన పడుతుంటారు. వీటి కారణంగా తరువాత వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్య గుండెపోటు. కనుక గుండెపోటు సమస్యను నివారించాలంటే బరువు పెరగకుండా చూసుకోవడం సైతం ఒక మార్గమని వైద్యులు సలహా ఇస్తున్నారు.


జన్యుపరమైన కారణాల వల్ల గుండెపోటు వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాలు వల్ల గుండెజబ్బులు వస్తాయి. గతంలో కుటుంబ సభ్యులకు గుండెపోటు వచ్చిన వారు ఉన్నట్లయితే వారి సంతానం ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Also Read: Health Benefits Of Bitter Gourd: ఈ ప్రయోజనాలు తెలిస్తే కాకరకాయ కచ్చితంగా తింటారు


ఒత్తిడిని జయించకపోతే గుండెపోటు సమస్య బారిన పడతాం. వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ మానసిక ఒత్తిడిని తీసుకునేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒత్తిడిని జయించాలంటే తరచుగా యోగా లేక శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. 
Also Read : Health Benefits Of Curry Leaves: కరివేపాకుతో షుగర్ కంట్రోల్, గర్భిణులకు మేలు సహా ఎన్నో ప్రయోజనాలు