Summer Care : ఎండాకాలం కారణంగా ఇప్పుడు చాలామంది డీహైడ్రేషన్ బారినపడుతున్నారు. మన శరీరానికి పోషకాలతో పాటు సరిపడా నీళ్లు కూడా ఎంతో అవసరం. ఎంత మంచి ఆహారం తీసుకున్నప్పటికీ.. రోజుకి సరిపడా మంచినీళ్లు తాగకపోతే, ‌ మన శరీరం ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతూఉంటుంది. అందుకే మనల్ని మనం కాపాడుకోవడానికి ఎక్కువగా మంచినీళ్ళను తాగుతూ ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ మన బాడీ నిజంగానే డిహైడ్రేట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? అసలు మన బాడీ లో నీటి కొరత ఏర్పడింది అని మనకి ఎలా తెలుస్తుంది? మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయి? నిజంగానే నీటి కొరత ఉంటే మనం ఏం చేయాలి? వంటి విషయాలు తెలుసుకుందాం.


ఒకవేళ మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు మనకి నిర్జలీకరణ వస్తుంది. ఆంగ్లంలో దీనిని డిహైడ్రేషన్ అంటారు. మన మూత్రం ముదురు రంగులో ఉండటం మన శరీరంలో డిహైడ్రేషన్ మొదలైంది అని చెప్పే మొదటి సంకేతం.


మలబద్ధకం కూడా దాని వల్ల వచ్చే ముఖ్యమైన సమస్య. ఎక్కువగా దాహంగా అనిపించటం కూడా మన శరీరం మనకు ఇస్తున్న సంకేతమే. కళ్ళు తిరగడం, తలనొప్పి ఎక్కువగా రావడం, కొంచెం పని చేసినా శరీరం వెంటనే అలసిపోయినట్లు అనిపించడం, చర్మం బాగా పొడిబారి పోవడం, మొటిమలు ఎక్కువ అవ్వడం వంటివి కూడా నీటి కొరతకి సంకేతాలే. 


ఈ నిర్జలీకరణకి సకాలంలో చికిత్స అందాలి లేకపోతే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి డిహైడ్రేషన్ బారిన పడకుండా మనం రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల వరకు నీళ్లు తాగాలి. అది కాకుండా అధిక నీటి కంటెంట్ ఉండే ఫ్రూట్స్ కూరగాయలను మన డైట్ లో యాడ్ చేయాలి. 


నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే పళ్ళు తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తాగడం, ఇంట్లోనే షర్బత్ చేసుకొని తాగడం వంటివి చేస్తూ ఉండటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవేళ ఏదైనా సమస్య వస్తే తక్షణమే డాక్టర్ ని సంప్రదించటం మంచిది. అలా కాదు అని ఎండాకాలం ఈ సమస్యను వదిలేస్తే మాత్రం అది పెను ప్రమాదానికి దారితీస్తుంది


Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌


Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter