Heart Attack Symptoms: గుండెపోటు వెంటనే రాదు. కొన్ని నెలల క్రితమే దీనికి సంబంధించిన సంకేతాలు కనబడతాయి. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో యువత ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. చాలా మంది హార్ట్ ఎటాక్ (Heart Attack) వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుకు ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో, దానిని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛాతి నొప్పి (Chest pain): గుండెపోటు వచ్చే ముందు మీకు ఛాతీ నొప్పి (Chest pain) వస్తుంది. ఆ సమయంలో కొద్దిగా అసౌకర్యంగా కూడా ఉంటుంది. 


బలహీనంగా అనిపిస్తుంది: ఇది కాకుండా, గుండెపోటుకు ముందు మీకు బలహీనతగా (Feeling weak), మైకంగా ఉండవచ్చు. మీకు దవడ, మెడ మరియు వెనుక భాగంలో అసౌకర్యంగా, ఏకకాలంలో నొప్పి ఉంటుంది. 


చేతులు, కాళ్ళ వాపు: మీ చేతులు మరియు కాళ్ళలో వాపు ప్రారంభమవుతుంది. అయినప్పటికీ, చాలా మంది ఈ లక్షణాన్ని విస్మరిస్తారు. కానీ దీనిని తేలికగా తీసుకోవద్దని చెప్పండి. 


విపరీతంగా చెమటలు: గుండెపోటు వచ్చే ముందు రోగికి విపరీతంగా చెమటలు పడతాయి. అంతేకాకుండా అతను వాంతి కూడా చేయవచ్చు. మీకు కూడా అలాంటి లక్షణాలను కనిపిస్తే..వెంటనే వైద్యుడిని సంప్రదించండి.


హృదయాన్ని రక్షించడానికి ఏమి చేయాలి?
మెుదటగా మీ జీవనశైలిని మార్చుకోండి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లను చేర్చండి. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకండి. ఎందుకంటే గుండెపోటుకు ప్రధానం కారణం కూడా ఒత్తిడి.


Also Read: Freckle Problems: ముఖంపైన మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook