Freckle Problems: ముఖంపైన మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి

Freckle Removal Tips: ముఖంపై ఉండే మచ్చల వల్ల మన అందం దెబ్బతింటుంది. ఈ సమస్యకు వంటింటి చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. ఎలాగో చూద్దాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 02:18 PM IST
Freckle Problems: ముఖంపైన మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వాటికి ఇలా చెక్ పెట్టండి

How To Remove Facial Blemishes: మన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల మార్పులు తదితర కారణాల వల్ల ముఖంపై మచ్చలు (Freckle) ఏర్పడతాయి. మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ 4 వంటింటి చిట్కాలతో (Home Remedies) చెక్ పెట్టొచ్చు. 

1. నిమ్మకాయ (Lemon)
ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ రసం తీసి అందులో తేనె కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మచ్చలు తగ్గే వరకు దీన్ని అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు రాసుకోవడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.

2. బంగాళాదుంప (Raw Potato)
బంగాళాదుంపను సగానికి కట్ చేయండి. దానిని నీటిలో ముంచి ముఖంపై రుద్దండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగండి. దీన్ని నెల రోజుల పాటు రోజుకు రెండు మూడు సార్లు ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న మచ్చలు పోతాయి. 

3. ఉల్లిపాయలు (Onion)
ముందుగా ఉల్లిపాయను ముక్కలుగా కోసుకోవాలి. మచ్చలున్న భాగంలో ఉల్లిపాయ ముక్కను రుద్దండి. ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత, గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఉల్లిపాయ రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుంది. దీన్ని రోజుకు రెండుసార్లు అప్లై చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉల్లిపాయలో విటమిన్-సి మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి పిగ్మెంటేషన్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

4. అలోవెరా జెల్ (Aloe Vera Gel)
ముందుగా కలబంద గుజ్జును తీసి అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేయాలి. ఇప్పుడు ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసి ముఖానికి పట్టించాలి. ఇలా చేసిన తర్వాత ముఖంపై రుద్దండి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే కొద్ది రోజుల్లోనే ముఖంపై ఉండే మచ్చలు తగ్గిపోతాయి.

Also Read: Male Infertility: కొత్తగా పెళ్లయిన మగవారు అర్ధరాత్రి వరకు స్మార్ట్‌ ఫోన్ వాడకండి.. ఎందుకంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News