High Cholesterol Food: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా గుండెపోటు, అధిక రక్తపోటు(BP), మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది:


మంచి కొలెస్ట్రాల్ నరాలను శక్తి వంతంగా చేసేందుకు కృషి చేస్తుంది. అయితే తరచుగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల రక్త నాళాలలో కొలెస్ట్రాల్ పరిమితి పెరిగి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు.


అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు:


1. స్వీట్:


మన శరీరానికి కొంత మొత్తంలో మాత్రమే చక్కెర అవసరం. దానిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలో షుగర్ కంటెంట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ LDL పెరగడానికి దారి తీస్తుంది.


2. ఆయిల్ ఫుడ్స్:


భారత్‌లో ఆయిల్ రిచ్ ఫుడ్ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆహారం ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.  ఆయిల్ రిచ్ ఫుడ్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, సమోసా, కచోరీ వంటి డీప్ ఫ్రైడ్‌లకు దూరంగా ఉండాలి.


3. ప్రాసెస్డ్ ఫుడ్:


ప్రస్తుతం ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరిగిపోంది. ముఖ్యంగా ఈ తరహా మాంసాహారం  తినేవారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


 ఆహారంలో విషయంలో ఈ నియమాలను పాటించండి:


ఊబకాయాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇందుకోసం వాల్ నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదని
సూచిస్తున్నారు.  అంతే కాకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం మంచిదని తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా పండ్ల నుంచి జ్యూస్ తాగితే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.



(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Benefits of Eating Oats: టైప్ 2 డయాబెటిస్‌ పేషెంట్స్ ఈ ఆహారం తింటే బ్లడ్‌లో షుగర్ లెవెల్ తగ్గుతాయి..!!


Also Read: Mango Protein Shake: మ్యాంగో ప్రొటీన్ షేక్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి